Vivo: భారత్‌లో లాంచైన Vivo Y28s, Y28e, ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Highlights

  • భారత్‌లో కొత్త వివో ఫోన్లు విడుదల
  • లాంచైన వివో వై28ఎస్, వై28ఈ
  • ప్రారంభ ధర రూ.10,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా వై-సిరీస్ లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేసింది. Vivo Y28s, Vivo Y28e అనే పేర్లతో ఈ డివైజెస్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఎంతో స్టైలిష్ డిజైన్‌తో వచ్చాయి. ఈ డివైజెస్ లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఎల్సీడీ ప్యానెల్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ల యొక్క ధర, లభ్యత మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y28s, Vivo Y28e స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28s, Vivo Y28e డివైజెస్ లో 6.56-ఇంచ్ స్క్రీన్స్, 840 నిట్స్ బ్రైట్నెస్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. వై28ఎస్ లో హెచ్డీ+ ఎల్సీడీ స్క్రీన్, వై28ఈ లో హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28s, Vivo Y28e డివైజెస్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్సెట్ ఉంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

సాఫ్ట్‌వేర్: Vivo Y28s, Vivo Y28e డివైజెస్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28s 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. Vivo Y28e 4జిబి ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.

బ్యాటరీ: Vivo Y28s, Vivo Y28e స్మార్ట్‌ఫోన్లలో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ ఫోన్లు 15 వాట్ ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీతో వచ్చాయి.

కెమెరా: Vivo Y28s, Vivo Y28e ఫోన్లలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. Vivo Y28s లో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 మెయిన్ కెమెరా ఉంది. Vivo Y28e లో 13ఎంపి ప్రైమరీ కెమెరా ఉంది. వై28ఎస్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండగా, వై28ఈ లో 5ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది. ఈ రెండు ఫోన్లు కూడా సూపర్ నైట్ కెమెరా మోడ్ కి సపోర్ట్ చేస్తాయి.

Vivo Y28s, Vivo Y28e ధరలు

Vivo Y28s 4జిబి+128జిబి మోడల్ ధరను రూ.13,999 గా పెట్టారు. 6జిబి+128జిబి వేరియంట్ ధర రూ.15,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది.

Vivo Y28e 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,999 గా ఉంది. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధరను రూ.11,999 గా నిర్ణయించారు.

ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా ఈ-స్టోర్ మరియు అన్ని పార్ట్నర్ రిటైల్ స్టోర్స్ లో ఈ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.

Vivo Y28s డివైజ్ వింటేజ్ రెడ్, ట్వింక్లింగ్ పర్పుల్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. Vivo Y28e వింటేజ్ రెడ్ మరియు బ్రిడ్జ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Previous articleColor Pro 5G: భారత్‌లో కలర్ చేంజింగ్ ఫోన్ లాంచ్ చేయనున్న itel
Next articleRedmi K80, K80 Pro: లీకైన రెడ్మీ కే80 సిరీస్ వివరాలు
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.