
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel నుంచి త్వరలో ఏ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. itel A80 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఫోన్ గతేడాది లాంచైన ఐటెల్ ఏ70 కి సక్సెసర్ గా వస్తోంది. తాజాగా itel A80 డివైజ్ గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు రివీల్ అయ్యాయి. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
itel A80 గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్
itel A80 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఐటెల్-ఏ671ఎల్సీ అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
లిస్టింగ్ ప్రకారం, itel A80 స్మార్ట్‌ఫోన్ యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ తో రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఆక్టా-కోర్ ప్రాసెసర్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.8 గిగాహెర్ట్జ్.
itel A80 స్మార్ట్‌ఫోన్ 3జిబి ర్యామ్ తో గూగుల్ ప్లే కన్సోల్ పై లిస్ట్ అయ్యింది. ఇతర ర్యామ్ వేరియంట్స్ లో కూడా ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
itel A80 స్మార్ట్‌ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ పై ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. ఇంకా హెచ్డీ+ స్క్రీన్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 320 పిక్సెల్ డెన్సిటీతో లిస్ట్ పై ఐటెల్ ఏ80 కనిపించింది.

itel A70 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: itel A70 లో 6.6-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, 720*1612 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 500 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: itel A70 లో యూనిఎస్ఓసీ టీ603 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం పవర్‌వీఆర్ జీఈ8322 జీపీయూ వినియోగించారు.
ఓఎస్: itel A70 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆధారిత ఐటెల్ ఓఎస్ 13 కస్టమ స్కిన్ పై పని చేస్తుంది.
ర్యామ్, స్టోరేజీ: itel A70 డివైజ్ 4జిబి ఫిజికల్ ర్యామ్, 8జిబి ఎక్స్టెండెడ్ ర్యామ్, 64జిబి/128జిబి/256జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
కెమెరా: itel A70 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 13ఎంపి ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: itel A70 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు.
ఇతర ఫీచర్లు: itel A70 లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్ కేవలం 8.6 మి.మీ మందం మాత్రమే ఉంటుంది.











