
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ HONOR త్వరలో మ్యాజిక్ 6 సిరీస్‌కు సక్సెసర్ HONOR Magic 7 సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా, HONOR Magic 7 మరియు HONOR Magic 7 Pro ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా HONOR Magic 7 యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. లీక్ ప్రకారం, ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఓసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
HONOR Magic 7 స్పెసిఫికేషన్స్ (లీక్)
HONOR Magic 7 యొక్క స్పెసిఫికేషన్స్‌ను చైనాకు చెందిన సామాజిక మాధ్యమం వీబో పై టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ షేర్ చేశారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
లీక్ ప్రకారం, HONOR Magic 7 డివైజ్ 1.5కే రెజుల్యూషన్ గల డిస్ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే, HONOR Magic 7 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50హెచ్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్882 టెలీఫోటో కెమెరా, 50ఎంపి థర్డ్ లెన్స్ ఉంటాయి.
HONOR Magic 7 స్మార్ట్‌ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని సమాచారం. ఈ చిప్సెట్ రాబోయే అక్టోబర్ లో లాంచ్ అవుతుంది.
లేటెస్ట్ లీక్ ద్వారా బ్యాటరీ సైజ్ రివీల్ కాలేదు. మ్యాజిక్ 7 సిరీస్ స్మార్ట్ఫోన్లు 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే అవకాశం ఉంది.
Honor Magic 6 స్పెసిఫికేషన్స్ (చైనా)
డిస్ప్లే: Honor Magic 6 లో 6.78-ఇంచ్ ఫుల్హెచ్డీ+ ఓఎల్ఈడీ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1264*2800 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
చిప్సెట్: Honor Magic 6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 750 జీపీయూ వినియోగించారు.
ర్యామ్, స్టోరేజీ: Honor Magic 6 డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది.
కెమెరా: Honor Magic 6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి వైడ్ యాంగిల్ ఓఐఎస్ లెన్స్, 32ఎంపి టెలీఫోటో ఓఐఎస్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Honor Magic 6 లో పవర్ బ్యాకప్ కోసం 5450 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 66 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.












