
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme తన 12 ప్రో సిరీస్ లోని Realme 12 Pro 5G డివైజ్ ధరను తగ్గించింది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.4,500 తక్కువ ధరకు లభించనుంది. రియల్మీ 12 ప్రో లాంచ్ ధర రూ.25,999 గా ఉంది. ఇప్పుడు తగ్గింపు తర్వాత ఈ ఫోన్‌ని యూజర్లు రూ.21,990 కే సొంతం చేసుకోవచ్చు. ధర తగ్గింపుకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం పదండి.
Realme 12 Pro 5G ధర తగ్గింపు వివరాలు
Realme 12 Pro 5G రెండు వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ రూ.25,999 ధరతో విడుదలైంది. ప్రస్తుతం రూ.4,009 తగ్గింపు తర్వాత ఇది రూ.21,990 కి లభిస్తుంది.
Realme 12 Pro 5G 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ రూ.26,999 ధరతో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం రూ.4,505 తగ్గింపు తర్వాత దీన్ని రూ.22,494 కే సొంతం చేసుకోవచ్చు.
Realme 12 Pro 5G 12జిబి + 256జిబి స్టోరేజీ మోడల్ కూడా తర్వాత లాంచ్ అయ్యింది. ఈ వేరియంట్ ధర తగ్గింపు వివరాలు ఇంకా తెలియదు.
Realme 12 Pro 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme 12 Pro 5G లో 6.7-ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1.07 బిలియన్ కలర్స్, 100% పీ3 కలర్ గేముత్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 800 నిట్స్ మాగ్జిమమ్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Realme 12 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ప్రాసెస్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో జీపీయూ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Realme 12 Pro 5G డివైజ్ మూడు మెమొరీ వేరియంట్స్ లో లభిస్తుంది. అవి: 8జిబి + 128జిబి, 8జిబి+256జిబి మరియు 12జిబి+256జిబి. డైనమిక్ ర్యామ్ ఫీచర్ తో 8జిబి వరకు ర్యామ్ ని పెంచుకోవచ్చు.
కెమెరా: Realme 12 Pro 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 32ఎంపి సోని ఐఎంఎక్స్709 టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ: Realme 12 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Realme 12 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Realme 12 Pro 5G లో హై-రెజ్ డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై, బ్లూటూత్ ఉన్నాయి.











