
ప్రముఖ టెక్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో రెండు కొత్త ట్యాబ్లెట్స్ భారత్ లో లాంచ్ కానున్నాయి. Redmi Pad SE 4G మరియు Redmi Pad Pro 5G పేర్లతో ఈ ట్యాబ్లెట్స్ లాంచ్ కానున్నాయి. ఇప్పటికే ప్రో వర్షన్ చైనాలో లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ఈ రెండు ట్యాబ్లెట్స్ యొక్క ల్యాండింగ్ పేజీలు షావోమి ఇండియా వెబ్‌సైట్ పై కనిపిస్తున్నాయి. ఇటీవలె, టిప్‌స్టర్ సుదాన్శు అంభోరే Redmi Pad SE 4G యొక్క స్పెసిఫికేషన్స్ లీక్ చేశారు. తాజాగా ఇతను, మరోసారి X పై మరిన్ని వివరాలు షేర్ చేశారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.
Redmi Pad SE 4G స్పెసిఫికేషన్స్ (రూమర్లు)
డిస్ప్లే: టిప్‌స్టర్ ప్రకారం, Redmi Pad SE 4G 8.7 లేదా Redmi Pad SE 4G ట్యాబ్లెట్ లో 8.7-ఇంచ్ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 1340*800 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1500:1 కాంట్రాస్ట్ రేషియో, 10-బిట్ ట్యాబ్లెట్, డీసీ డిమ్మింగ్, టీయూవీ రెయిన్‌ల్యాండ్ లొ బ్లూ లైట్, ఫ్లికర్-ఫ్రీ సర్టిఫికేషన్ ఉంటాయి.
ర్యామ్, స్టోరేజీ: Redmi Pad SE 4G ట్యాబ్లెట్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ అవుతుంది. అదనపు స్టోరేజీ కోసం మైక్రోఎస్డీ కార్డ్ ఆప్షన్ ఉంది.
సాఫ్ట్‌వేర్: Redmi Pad SE 4G ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఎంఐయూఐ ప్యాడ్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కెమెరా: Redmi Pad SE 4G లో 8ఎంపి రియర్ కెమెరా ఉంటుంది. దీంతో పాటు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 5ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ప్రాసెసర్: Redmi Pad SE 4G ట్యాబ్లెట్ తో మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ ఉంటుంది.
బ్యాటరీ: Redmi Pad SE 4G డివైజ్ 6,650 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
కనెక్టివిటీ: Redmi Pad SE 4G ట్యాబ్లెట్ లో డ్యూయల్ సిమ్, 4జీ, 5 గిగాహెర్ట్జ్ వై-ఫై, బ్లూటూత్ 5.3, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ-సీ పోర్ట్ ఉంటాయి.
ఇతర ఫీచర్లు: Redmi Pad SE 4G లో డ్యూయల్ స్పీకర్స్, డాల్బీ అట్మాస్ ఉంటాయి.
బరువు, చుట్టుకొలత: Redmi Pad SE 4G ట్యాబ్లెట్ 211.58 మి.మీ పొడవు, 125.48 మి.మీ వెడల్పు, 8.8 మి.మీ మందం, 375 గ్రాముల బరువు ఉంటుంది.
Redmi Pad SE 4G ధర (అంచనా), కలర్స్
యూరప్ లో Redmi Pad SE 4G (వై-ఫై) యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర 169 యూరోలు (సుమారు రూ.15,300) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ట్యాబ్లెట్ బ్లాక్, గ్రీన్ మరియు బ్లూ కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.











