హైలైట్స్:
- భారత్ లో ఇప్పటి వరకు రిజిస్టర్ అయిన 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వెహికిల్స్
- ఫేమ్ 2 స్కీమ్ ద్వారా దేశంలో ఇప్పటికి 2,800 ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
- గ్లోబల్ ఆటోమొబైల్ రంగంలో భారత వాటా 13.24 శాతం
రవాణా వ్యవస్థను విద్యుత్ మయం చేయాలనే దిశగా భారతదేశం వేస్తున్న అడుగులు వేగవంతమయ్యాయి. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవలె మాట్లాడుతూ, దేశంలో ఎలక్ట్రిక్ రవాణా రంగం పురోభివృద్ధి, అవలంబిస్తోన్న విధానాలు, ఈవీ ఛార్జింగ్ ఇన్ఫాస్ట్రక్చర్ తదితర విషయాలను గురించి పంచుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఇప్పటికే 13 లక్షల విద్యుత్ వాహనాలు రిజిస్టర్ అయ్యాయని అన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా 2,800 ఛార్జింగ్ స్టేషన్లు పని చేస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.
ఎలక్ట్రిక్ వెహికిల్స్ ను అందరూ అడాప్ట్ చేసుకోవాలని, భారత ప్రభుత్వం గత కొంతకాలంగా ఒత్తిడి తెస్తోంది. ఫేమ్ 2 స్కీమ్ ద్వారా సబ్సిడీలను కూడా అందిస్తోంది. అలాగే రాష్ట్రాల వారీగా ప్రచారాలు నిర్వహించి జనాలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు తన వంతు కృషి చేస్తోంది. ఈవీ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సెక్టర్ ల పెట్టుబడులు కూడా ఈవీ ఇండస్ట్రీకి ఊతమిస్తున్నాయి.
భారత్ లో ఇప్పటికి 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ రిజిస్టర్ అయ్యాయి – రవాణాశాఖ మంత్రి
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, భారతదేశంలో ఇప్పటికి 13 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వెహికిల్స్ రిజిస్టర్ అయినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క రిజిస్ట్రేషన్లు చేరితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువవుతుంది. ఫేమ్ 2 పథకం ద్వారా నమోదైన గణాంకాలను మంత్రి వివరించారు.
ఫేమ్ 2 పథకం ద్వారా దేశ వ్యాప్తంగా 68 నగరాల్లో 2,877 ఎలక్ట్రిక్ వెహికిల్ ఛార్జింగ్ స్టేషన్స్ సాంక్షన్ అయ్యాయని మంత్రి చెప్పారు. ఇక 9 ఎక్స్ ప్రెస్ వేస్, 16 హైవేస్ పై 1,577 ఛార్జింగ్ స్టేషన్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు.
వాహన్ 4 పోర్టల్ గణాంకాలను బట్టి, ఇప్పుడు 13,34,385 ఎలక్ట్రిక్ వెహికిల్స్ భారత్ లో రిజిస్టర్ అయ్యాయి. ఒక కేంద్రపాలిత ప్రాంతం, మూడు రాష్ట్రాలు మినహాయించి పైన చెప్పిన గణాంకాలు నమోదయ్యాయి. జులై 14, 2022 కల్లా 2,826 ఛార్జింగ్ స్టేషన్స్ కార్యాకలాపాలను నిర్వహిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు.
గత మూడేళ్ళలో భారత్ లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ గ్రోత్ చాలా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఇది 36 శాతం మేర పెరిగే అవకాశముందని అంచనా. ప్రస్తుత ఫిస్కాల్ ఇయర్ లో సేల్స్ 2021-22 కంటే మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు సమాచారం. ఇక 2022-23 లో, భారత్ లో 8 నుంచి 9 లక్షల యూనిట్స్ అమ్ముడవ్వనున్నట్లు అంచనా.
భారత్ ఒక బలమైన ఆటోమొబైల్ మార్కెట్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచంలో ఉన్న వాహనాలలో 13.24 శాతం వెహికిల్స్ భారత గడ్డపైనే పరుగు తీస్తున్నాయి. దీన్ని బట్టి భారత్ యొక్క మార్కెట్ సత్తా ఏంటో ఇట్టే తెలుస్తోంది. ఇప్పటికే, ఎన్నో వెహికిల్ కంపెనీలు భారత్ లో కనీసం ఒక్క ఎలక్ట్రిక్ వెహికిల్ నైనా లాంచ్ చేసి ఉన్నాయి. అలాగే మరెన్నో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నాయి.












