
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi గతేడాది Redmi 12 సిరీస్ లాంచ్ చేసింది. తాజాగా ఈ లైనప్ లోని Redmi 12 4G ధరను కంపెనీ తగ్గించింది. తక్కువ ధర, చక్కటి స్పెసిఫికేషన్లు గల ఈ ఫోన్‌ని కొనాలనుకునే వారికి ఇదే మంచి సమయం అని చెప్పవచ్చు. ఎందుకంటే రెడ్మీ కంపెనీ కూపన్ డిస్కౌంట్స్ మరియు ఇతర ఆఫర్లను తన కస్టమర్ల కోసం తీసుకొచ్చింది. మరి, ఆ వివరాలు తెలుసుకుందామా?
Redmi 12 4G కొత్త ధర మరియు ఆఫర్
Redmi 12 4G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం రూ.9,999 ధరకి ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ పై అందుబాటులో ఉంది. కంపెనీ అందిస్తోన్న రూ.1,000 కూపన్ డిస్కౌంట్ తో ఈ ఫోన్‌ని వినియోగదారులు రూ.8,999 కే సొంతం చేసుకోవచ్చు.
ఈ తగ్గిన ధర 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ కి వర్తిస్తుంది. కూపన్ ఆఫర్ తో పాటు, కస్టమర్లు రూ.499 అమెజాన్ క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో ఈ ఫోన్ రూ.8,499 కే లభిస్తుంది. ఇదే ఆఫర్ కంపెనీ వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఉంది.
4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ బేస్ వేరియంట్ పై కంపెనీ వెబ్సైట్ లో రూ.1500 డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఆఫర్ తర్వాత, ఈ రెడ్మీ ఫోన్ రూ.7,999 కే లభించనుంది.
అంతేకాదు, 3 నుంచి 6 నెలల కాలపరిమితితో నో-కాస్ట్ ఈఎంఐ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా రెడ్మీ బ్రాండ్ అందిస్తోంది.

Redmi 12 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Redmi 12 లో 6.79-ఇంచ్ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
ప్రాసెసర్: Redmi 12 లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ వాడారు. సాధారణ వినియోగానికి ఈ చిప్ బాగా పని చేస్తుంది.
మెమొరీ: Redmi 12 డివైజ్ 6జిబి ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ, 6జిబి వర్చువల్ ర్యామ్ ని కలిగి ఉంది.
కెమెరా: Redmi 12 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Redmi 12 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Redmi 12 డివైజ్ లో సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ53 ప్రొటెక్షన్, డ్యూయల్ సిమ్, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఫీచర్లు ఉన్నాయి.











