
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ మేకర్ Itel త్వరలో పీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Itel P65 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ ఐటెల్ పాకిస్తాన్ అధికార వెబ్సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క డిజైన్ మరియు స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఐటెల్ పీ65 కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
Itel P65 డిజైన్
Itel P65 స్మార్ట్ఫోన్ స్టైలిష్ సైబర్ డిజైన్ తో వస్తోంది. సైబర్ షీల్డ్ మరియు బ్రష్డ్ మెటాలిక్ టెక్షర్ బ్యాక్ ప్యానెల్ పై కనిపిస్తున్నాయి. అలాగే రింగ్ లైట్ కూడా కనిపిస్తోంది. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, చార్జింగ్ పెట్టినప్పుడు మరియు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. ఇకపోతే ఈ ఫోన్ 192.4 గ్రాముల బరువు, 7.89 మి.మీ మందం ఉంటుంది.
Itel P65 స్మార్ట్ఫోన్ సైబర్ టైటానియమ్, సైబర్ బ్లాక్ మరియు సైబర్ బ్లేజ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.
Itel P65 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Itel P65 లో 6.7-ఇంచ్ పంచ్ హోల్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, డైనమిక్ బార్ 2.0 ఉంటాయి.
ప్రాసెసర్, సాఫ్ట్వేర్: Itel P65 లో యూనిఎస్ఓసీ టీ615 చిప్సెట్ ఉంటుంది. ఈ ఫఓన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఐటెల్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
మెమొరీ: Itel P65 డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ లో 8జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. అయితే టాప్ వేరియంట్ మాత్రమే ఎన్ఎఫ్సీ కి సపోర్ట్ చేస్తుంది.
కెమెరా: Itel P65 లో 50ఎంపి అల్ట్రా-క్లియర్ 10ఎక్స్ సూపర్ జూమ్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Itel P65 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Itel P65 లో ఆటమ్ స్టోరేజీ టెక్నాలజీ, ఐబూస్ట్ గేమింగ్ ఇంజిన్, ఫేస్ అన్లాక్, మల్టీఫంక్షనల్ ఎన్ఎఫ్సీ, ఏఐ వాయిస్ అసిస్టెంట్, ఆటోమేటిక్ సీన్ రికగ్నిషన్ ఉంటాయి.











