
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Apple నుంచి వచ్చిన iPhone 13 ఇప్పుడు తక్కువ ధరకే లభించనుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్, ఐఫోన్ 13 ను ఇప్పటి వరకు లేనంత చవకగా అందిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతోన్న అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival Sale) లో iPhone 13 128జిబి వేరియంట్‌ను రూ.48,799 కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.
iPhone 13 సేల్ డిస్కౌంట్, ఆఫర్ వివరాలు
iPhone 13 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.59,600 కాగా, Amazon సేల్ లో భాగంగా 18 శాతం డిస్కౌంట్ తో ప్రస్తుతం రూ.48,799 కే లభిస్తోంది.
మీరు గనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగి ఉంటే, మరింత ఎక్కువ బెనిఫిట్ ఈ ఫోన్ పై పొందవచ్చు. ఒక్కసారిగా పేమెంట్ చేసి ఐఫోన్ 13 కొంటే, వారికి రూ.750 డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ మీకు రూ.48,049 కే లభించనుందన్నమాట.
వడ్డీతో కూడిన ఈఎంఐ ఆప్షన్‌తో మరో రూ.1500 డిస్కౌంట్ పొందవచ్చు. అయితే ఈఎంఐ కాలపరిమితి ఎక్కువైతే ఈ ఆఫర్ ప్రయోజనం పెద్దగా ఉండదు. అందుకే మీరు 3 నుంచి 6 నెలల కాలపరిమితి ఎంపిక చేసుకుంటే అప్పుడు రూ.1500 డిస్కౌంట్ కలపుకుని iPhone 13 మీకు రూ.48.499 కే లభిస్తుంది.
అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. మీరు గనుక ఈ కార్డ్ కలిగి ఉంటే, రూ.2,197.34 వరకు వడ్డీని తగ్గించుకోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్లో మీరు iPhone 13 కొనవచ్చా?
iPhone 13 స్మార్ట్‌ఫోన్ 2022 లో లాంచ్ అయ్యింది. 2028 వరకు ఈ ఫోన్‌కి సాఫ్ట్వేర్ అప్డేట్స్ లభిస్తాయి. అంటే మీకు కొన్నేళ్ళ దాకా ఓఎస్ మరియు సెక్యూరిటీ అప్డేట్స్ల లభిస్తాయన్న మాట.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న iPhone 15 మరియు త్వరలో రాబోవు iPhone 16 తో పోల్చితే, ప్రాసెసర్, కెమెరా, డిజైన్, బ్యాటరీ సైజ్ వంటి విషయాల్లో iPhone 13 బలహీనంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ ఫోన్ మీకు క్వాలిటీ ఐఫోన్ అనుభూతిని అందిస్తుంది. అదీనూ, రూ.50,000 లోపు బడ్జెట్ లో కావాలంటే, iPhone 13 మంచి ఆప్షనే.
మీరు గనుక కాస్త బడ్జెట్ పెంచుకుంటే, రూ.56,999 ధరలో ఫ్లిప్‌కార్ట్ పై iPhone 14 Plus లభిస్తుంది. దీనికి 2029 వరకు సాఫ్ట్వేర్, సెక్యూరిటీ అప్డేట్స్ లభిస్తాయి. ఇంకా పెద్ద డిస్ప్లే, మంచి బ్యాటరీ లైఫ్ ఇతర అప్‌గ్రేడ్స్ అనేవి ప్లస్ పాయింట్లు.
ఇక ఆండ్రాయిడ్ విషయానికి వస్తే, రూ.50,000 లోపు బడ్జెట్ లో మీరు Samsung Galaxy S23 5G ని కన్సిడర్ చేయవచ్చు. ఈ ఫోన్ మెరుగైన స్పెసిఫికేషన్స్‌ను తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది.












