
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో ఎఫ్-సిరీస్ కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. ఈ సిరీస్ లో భాగంగా OPPO F27 5G మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ ను కన్ఫర్మ్ చేసింది. ఈమేరకు ఒక టీజర్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్ పై షేర్ చేసింది. అియతే ఇప్పటికే OPPO F27 Pro Plus భారత్ లో లాంచ్ అయ్యింది. ఇప్పుడు OPPO F27 5G ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఓసారి ఎఫ్27 5జీ లాంచ్ వివరాలను తెలుసుకుందాం.
OPPO F27 5G ఇండియా లాంచ్ ఖరారు
OPPO F27 5G ఇండియా లాంచ్‌ను ఒప్పో కంపెనీ అధికారికంగా తన వెబ్సైట్ తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా కన్ఫర్మ్ చేసింది.
పోస్ట్ లో గమనిస్తే, కమింగ్ సూన్ అని పేర్కొనబడి ఉంది. అంటే మరికొన్ని రోజుల్లో భారత్ లో ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుందన్నమాట.
టీజర్ పోస్ట్ ద్వారా ఫోన్ యొక్క బ్యాక్ ప్యానెల్ రివీల్ అయ్యింది. బ్యాక్ ప్యానెల పై భారీ సర్క్యులర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. దీంతో పాటు, ఒక రింగ్ లైట్ కూడా కనిపిస్తోంది.
ఒప్పో కంపెనీ ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. అయితే రిపోర్ట్ ప్రకారం, ఈ డివైజ్ వచ్చే వారం భారత్ లో లాంచ్ అవుతుందని సమాచారం.
OPPO F27 5G – A flaunt-worthy design is on its way! #StayTuned #DareToFlaunt #OPPOF275G pic.twitter.com/nkHaiyv2hb
— OPPO India (@OPPOIndia) August 12, 2024
OPPO F27 5G డిజైన్ (లీక్)
నిన్నే ఈ ఫోన్ యొక్క లైవ్ ఇమేజ్ లీక్ అయ్యింది. దాన్ని గమనిస్తే, OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ లో పంచ్ హోల్ డిస్ప్లే, ఫ్లాట్ ఎడ్జెస్ ఉంటాయని తెలుస్తోంది.
OPPO F27 5G స్మార్ట్‌ఫోన్ గ్రేడియంట్ కలర్ డిజైన్, మెటల్ ఫ్రేమ్ తో రానుందని అంచనా.
OPPO F27 Pro+ తో పోల్చితే, OPPO F27 5G లుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ వేరియంట్ కర్వ్డ్ డిస్ప్లే, వీగన్ లెదర్ బ్యాక్ కలిగి ఉంది. రెండు ఫోన్లలో బ్యాక్ ప్యానెల్ పై సర్క్యులర్ కెమెరా మాడ్యూల్ ఉంది. ఇందులో రెండు లేదా మూడు కెమెరాలు ఉంటాయి. ఇంకా వీటికి తోడు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉంది.
OPPO F27 Pro+ 5G స్పెసిఫికేషన్స్
OPPO F27 Pro+ 5G డివైజ్ జూన్ నెలలో లాంచ్ అయ్యింది. ఓసారి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
డిస్ప్లే: OPPO F27 Pro+ 5G లో 6.7-ఇంచ్ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
ప్రాసెసర్: OPPO F27 Pro+ 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: OPPO F27 Pro+ 5G డివైజ్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
కెమెరా: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ఒవి64బి ప్రైమరీ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: OPPO F27 Pro+ 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: OPPO F27 Pro+ 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: OPPO F27 Pro+ 5G లో ఐపీ69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ ఉంది.











