Redmi K80 Pro: లాంచ్‌కి ముందు లీకైన రెడ్మీ కే80 ప్రో స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు

Highlights

  • త్వరలో Redmi K80 Pro లాంచ్
  • నవంబర్‌లో చైనాలో విడుదల
  • 2కే డిస్ప్లే, 8 జెన్ 4 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi యొక్క సబ్-బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొన్ని ఫోన్లు లాంచ్ కానున్నాయి. లైనప్ లో Redmi K80, Redmi K80 Pro మరియు Redmi K80 Pro Plus ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు Redmi K80 Pro యొక్క స్పెసిఫికేషన్స్ మరియు డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Redmi K80 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)

లీక్ ప్రకారం, Redmi K80 Pro డివైజ్ ఫ్లాట్ ఓఎల్ఈడీ డిస్ప్లే, పంచ్ హోల్ కటౌట్, సన్నని బెజెల్స్, 2కే రెజుల్యూషన్, అల్ట్రాసోనిక్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో రానున్నట్లు తెలుస్తోంది.

పెర్ఫామెన్స్ విషయానికి వస్తే, Redmi K80 Pro లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్సెట్ ఉంటుందని సమాచారం. రానున్న అక్టోబర్ నెలలో ఈ చిప్సెట్ విడుదలవుతుంది.

ఇక కెమెరా విభాగం చూస్తే, Redmi K80 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండవచ్చు. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి టెలీఫోటో లెన్స్, ఒక వైడ్ యాంగిల్ లెన్స్ ఉండే అవకాశం ఉంది.

బ్యాటరీకి సంబంధించిన వివరాలు బయటకు రాలేదు. అయితే గతంలో వచ్చిన లీక్స్ బట్టి, Redmi K80 Pro లో 5500 ఎంఏహెచ్ లేదా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని తెలిసింది.

Redmi K80 Pro డిజైన్ (లీక్)

టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ప్రకారం, Redmi K80 Pro స్మార్ట్‌ఫోన్ లో బ్యాక్ ప్యానెల్ పై గుండ్రని కెమెరా మాడ్యూల్ ఉంటుంది. డెకరేటివ్ స్టడ్స్ కెమెరా మాడ్యూల్ పై ఉండబోవు. అయితే గ్లాస్ బ్యాక్, మెటల్ మిడిల్ ఫ్రేమ్ ఉంటాయి.

Redmi K70 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Redmi K70 Pro లో 6.67-ఇంచ్ టీసీఎల్ సీ8 ఓఎల్ఈడీ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Redmi K70 Pro స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Redmi K70 Pro లో 24జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉన్నాయి.

కెమెరా: Redmi K70 Pro లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి టెలీఫోటో 2ఎక్స్ జూమ్ లెన్స్, 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Redmi K70 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వాడారు. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Redmi K70 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఆప్షన్స్ ఉన్నాయి.

Previous articleOPPO F27 5G ఇండియా లాంచ్ ఖరారు, పూర్తి వివరాలు తెలుసుకోండి
Next articleVivo V40 vs OnePlus 12R: ఏ ఫోన్ బెటర్‌గా పెర్ఫామ్ చేస్తుంది?
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.