
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Oppo కొన్ని రోజుల క్రితం ఎఫ్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Oppo F27 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఈ ఫోన్ ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్, కంపెనీ వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ పై బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.
Oppo F27 5G ధర, ఆఫర్లు మరియు సేల్ వివరాలు
Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.22,999 గా ఉంది. 256జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.24,999 గా ఉంది.
Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఒప్పో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, మరియు ప్రముఖ రిటైల్ ఔట్‌లెట్స్ లో సేల్ కి అందుబాటులో ఉంది.
ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2500 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఫెడరల్ బ్యాంక్, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్, వన్‌కార్డ్ మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లు ఈ ఆఫర్‌ని, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ పై వినియోగించుకోవచ్చు.
ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్‌కార్ట్ పై రూ.1800 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే, 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు.
ఇంకా నో-కాస్ట్ ఈఎంఐ మరియు సాధారణ ఈఎంఐ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపోతే Oppo F27 5G స్మార్ట్‌ఫోన్ అంబర్ ఆరెంజ్ మరియు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Oppo F27 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: OPPO F27 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆక్వా డైనమిక్స్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 100 పర్సెంట్ డీసీఐ పీ3 కలర్ గ్యామట్, 92.2 పర్సెంట్ స్క్రీన్-టు-బాడీ రేషియో, 20:9 యాస్పెక్ట్ రేషియో, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.
చిప్సెట్: OPPO F27 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి జీ57 ఎంపీ2 జీపీయూ ఉపయోగించారు.
మెమొరీ: OPPO F27 5G లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ తో యూజర్‌కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. 128జిబి మరియు 256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీని ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. ఇంకా మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 2టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.
కెమెరా: OPPO F27 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఒమ్నివిజన్ ఒవి50డి ప్రైమరీ కెమెరా, 2ఎంపి ఒమ్నివిజన్ ఒవి02బి1బి పొట్రెయిట్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి సోని ఐఎంఎక్స్615 ఫ్రంట్ కెమెరా ఉంది. ఏఐ స్టూడియో, ఏఐ ఎరేజర్ 2.0, ఏఐ స్మార్ట్ ఇమేజ్ మ్యాటింగ్ 2.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ, చార్జింగ్: OPPO F27 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 45 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: OPPO F27 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: OPPO F27 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 5 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: OPPO F27 5G లో ఐపీ64 రేటింగ్, 300 పర్సెంట్ అల్ట్రా వాల్యూమ్ మోడల్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











