
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus త్వరలో Ace సిరీస్ ను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో భాగంగా, OnePlus Ace 5 మరియు OnePlus Ace 5 Pro మోడల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా OnePlus Ace 5 Pro యొక్క స్పెసిఫికేషన్స్, డిజైన్ వివరాలు లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.
OnePlus Ace 5 Pro స్పెసిఫికేషన్స్ (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్, త్వరలో రాబోవు ఒక ఫ్లాగ్షిప్ డివైజ్ యొక్క వివరాలను షేర్ చేశారు. అయితే ఫోన్ పేరును పేర్కొనలేదు. కానీ, అది OnePlus Ace 5 Pro అని అంచనా వేస్తున్నారు.
లేటెస్ట్ లీక్ ప్రకారం, OnePlus Ace 5 Pro డివైజ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చపి్సెట్ తో రానుందని సమాచారం.
OnePlus Ace 5 Pro స్మార్ట్‌ఫోన్ బీఓఈ ఎక్స్2 డిస్ప్లే, 1.5కే పిక్సెల్ రెజుల్యూషన్ తో వస్తున్నట్లు లీక్ ద్వారా తెలిసింది.

OnePlus Ace 5 Pro డిజైన్ (లీక్)
టిప్‌స్టర్ ప్రకారం, OnePlus Ace 5 Pro డివైజ్ ఫ్లాట్ ప్యానెల్ తో వస్తోంది. అలాగే మిడ్ ఫ్రేమ్ మెటల్ మెటీరియల్ తో మరియు బాడీ గ్లాస్ లేదా సిరామిక్ తో రానుందని లీక్ ద్వారా తెలుస్తోంది.
OnePlus Ace 5 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: లీక్ ప్రకారం, OnePlus Ace 5 లో 6.78-ఇంచ్ 8టీ ఎల్టీపీవో స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, మైక్రో కర్వ్ డిజైన్ ఉంటాయని తెలుస్తోంది.
ప్రాసెసర్: OnePlus Ace 5 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
కెమెరా: OnePlus Ace 5 స్మార్ట్‌ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు.
బ్యాటరీ, చార్జింగ్: OnePlus Ace 5 లో పవర్ బ్యాకప్ కోసం 6200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 100 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
OnePlus Ace 5 స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో OnePlus 13R పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.











