
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నేడు భారతీయ మార్కెట్ లో టీ3 సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Ultra 5G పేరుతో ఈ ఫోన్ విడుదలైంది. ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, 24జిబి వరకు ర్యామ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఓసారి వివో టీ3 అల్ట్రా 5జీ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Vivo T3 Ultra 5G ధర, సేల్ వివరాలు
Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో 3 వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలు ఎలా ఎన్నాయో తెలుసుకుందాం.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.31,999 గా పెట్టారు. 8జిబి ర్యామ్ + 256జిబి మిడ్ వేరియంట్ ధరను రూ.33,999 గా పెట్టారు. 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ టాప్ మోడల్ ధరను రూ.35,999 గా నిర్ణయించారు.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై రూ.3,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.
అలాగే పాత ఫోన్ మార్పు ద్వారా రూ.3,000 ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. అయితే బ్యాంక్ ఆఫర్ లేదా ఎక్స్చేంజ్ లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 19న రాత్రి 7 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, ఆన్లైన్ ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఫోన్ సేల్‌కి వస్తుంది.
Vivo T3 Ultra 5G స్మార్ట్‌ఫోన్ ఫారెస్ట్ గ్రీన్ మరియు లునార్ గ్రే కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo T3 Ultra 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo T3 Ultra లో 6.78-ఇంచ్ 3డీ కర్వ్డ్ 1.5కే అమోలెడ్ స్క్రీన్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, పీ3 సినిమా గ్రేడ్ కలర్ గ్యామట్, 8000000:1 కాంట్రాస్ట్ రేషియో, హెచ్డీఆర్ 10+ ఉన్నాయి.
ప్రాసెసర్: Vivo T3 Ultra లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. 91మొబైల్స్ చేసిన టెస్ట్ లో అంటుటు స్కోర్ 14,45,926 గా ఉంది. అయితే వివో మాత్రం, అంటుటు ప్లాట్‌ఫామ్ పై స్కోర్ 16,09,257 గా నమోదైందని తెలిపింది.
ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Ultra స్మార్ట్‌ఫోన్ 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 12జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంటుంది. దీంతో యూజర్‌కి గరిష్టంగా 24జిబి వరకు ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Vivo T3 Ultra లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి గ్రూప్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇది ఆటోఫోకస్, ఏఐ ఫేసియల్ కలరింగ్ టెక్నాలజీతో వచ్చింది.
బ్యాటరీ, చార్జింగ్: Vivo T3 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
కనెక్టివిటీ: Vivo T3 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Vivo T3 Ultra డివైజ్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.











