
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నేడు భారతీయ మార్కెట్ లో Realme P2 Pro 5G అనే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ లో 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐపీ65 రేటింగ్, రెయిన్వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 2 చిప్సెట్ ఉన్నాయి. సరే, ఓసారి రియల్మీ పీ2 ప్రో డివైజ్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందామా?
Realme P2 Pro 5G ధర, సేల్ వివరాలు
Realme P2 Pro 5G స్మార్ట్‌ఫోన్ 3 స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. వాటి ధరలను తెలుసుకుందాం.
8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999 గా ఉంది. 12జిబి + 256జిబి మోడల్ ధరను రూ.24,999 గా పెట్టారు. 12జిబి + 512జిబి మోడల్ ధరను రూ.27,999 గా నిర్ణయించారు.
లాంచ్ ఆఫర్ లో భాగంగా, బేస్ మోడల్ పై రూ.2,000 డిస్కౌంట్, ఇతర రెండు వేరియంట్స్ పై రూ.3,000 డిస్కౌంట్‌ను రియల్మీ అందిస్తోంది. దీంతో ఫోన్ల ధరలు వరుసగా రూ.19,999, రూ.21,999 మరియు రూ.24,999 చేరుతాయి.
ఎర్లీ బర్డ్ సేల్ ఫ్లిప్‌కార్ట్, రియల్మీ వెబ్సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్లెట్స్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. సేల్ టైమ్ సాయంత్రం 6 గంటల నుంచి 8.00 గంటలు.
Realme P2 Pro 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Realme P2 Pro 5G లో 6.7-ఇంచ్ శాంసంగ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 93.2% స్క్రీన్-టు-బాడీ రేషియో, 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 5,000,000:1 కాంట్రాస్ట్ రేషియో, 1.07 బిలియన్ కలర్స్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 100% పీ3 కలర్ గ్యామట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఉన్నాయి.
చిప్సెట్: Realme P2 Pro 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ 8 జెన్ 2 చిప్సెట్ వాడారు. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్. గ్రాఫిక్స్ కోసం 710 జీపీయూ వినియోగించారు. 9 లేయర్ కూలింగ్ సిస్టమ్ ను ఈ ఫోన్ లో అందించారు. అంటుటు స్కోరు 6,70,441 పాయింట్లు.
ర్యామ్, స్టోరేజీ: Realme P2 Pro 5G డివైజ్ 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీని ఆఫర్ చేస్తుంది.
కెమెరా: Realme P2 Pro 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్వైటీ-600 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ, చార్జింగ్: Realme P2 Pro 5G లో పవర్ బ్యాకప్ కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్వేర్: Realme P2 Pro 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Realme P2 Pro 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Realme P2 Pro 5G లో రెయిన్వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్, జీటీ మోడ్, ఎయిర్ జెశ్చర్, డ్యూయల్ స్టూడియో స్పీకర్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, హైపర్‌రా ఆల్గారిథమ్, ఏఐ పొట్రెయిట్ ఏఐ అల్ట్రా క్లారిటీ, ఏఐ గ్రూప్ ఫోటో ఎన్హాన్స్ ఉన్నాయి.











