
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung గతేడాది డిసెంబర్ నెలలో Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ ఫోన్ పై రూ.4,000 డిస్కౌంట్ని కంపెనీ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ25 5జీ లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ అందించారు. ఓసారి ఈ ఫోన్ యొక్క డిస్కౌంట్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Samsung Galaxy A25 5G డిస్కౌంట్ వివరాలు
Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇప్పుడు వీటి ధరలను తెలుసుకుందాం.
Samsung Galaxy A25 5G డివైజ్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ తో పాటు 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్స్ పై రూ.4,000 డిస్కౌంట్ లభిస్తోంది.
ఆఫర్ తర్వాత, ఈ ఫోన్ యొక్క బేస్ మోడల్ రూ.22,999 కి, టాప్ మోడల్ రూ.25,999 లభించనుంది. లాంచ్ సమయంలో వీటి ధరలు రూ.26,999 మరియు 29,999 గా ఉన్నాయి.
Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ బ్లాక్, యెల్లో మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Samsung Galaxy A25 5G పై రూ.4,000 డిస్కౌంట్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంది. కంపెనీ వెబ్సైట్ లో లాంచ్ ధరలు రూ.26,999 మరియు రూ.29,999 గానే ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ లో కూడా Samsung Galaxy A25 5G కొనుగోలుకి అందుబాటులో ఉంది. అయితే ఆఫ్‌లైన్ స్టోర్స్ మాదిరి ఆఫర్లు కాకుండా ఇక్కడ వేరుగా ఉంటాయి.
Samsung Galaxy A25 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A25 5G లో 6.5-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ స్క్రీన్, వాటర్ డ్రాప్ నాచ్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 1000 నిట్స్ బ్రైట్నెస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A25 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ఆక్టా-కోర్ చిప్. హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4GHz.
కెమెరా: Samsung Galaxy A25 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ: Samsung Galaxy A25 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఓఎస్: Samsung Galaxy A25 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: Samsung Galaxy A25 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.











