TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

Highlights

  • త్వరలో TECNO POP 9 5G లాంచ్
  • లాంచ్ తేదీని ప్రకటించిన కంపెనీ
  • సెప్టెంబర్ 24న విడుదల

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ TECNO త్వరలో పాప్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO POP 9 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో అడుగు పెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. అమెజాన్ లో ఈ ఫోన్ మైక్రోసైట్ కూడా ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్, డిజైన్ రివీల్ అయ్యాయి. ఓసారి లాంచ్ తేదీ, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

TECNO POP 9 5G ఇండియా లాంచ్ తేదీ ఖరారు

TECNO POP 9 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో సెప్టెంబర్ 24 వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది.

అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం, ఈ డివైజ్ ధర రూ.10,000 లోపు ఉంటుందని తెలుస్తోంది.

ఈ డివైజ్‌ను ప్రత్యేకించి యువత కోసం తీసుకొస్తున్నట్లు టెక్నో సంస్థ చెబుతోంది. ఈ ఫోన్ లో పవర్ఫుల్ ఫీచర్లను అందించినట్లు సమాచారం.

TECNO POP 9 5G డిజైన్

TECNO POP 9 5G స్మార్ట్‌ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉంటాయి. ఫ్రంట్ ప్యానెల్‌ను గమనిస్తే, పంచ్ హోల్ కటౌట్ ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. ఫోన్ కుడివైపున పవర్, వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. డివైజ్ తో పాటు రెండు స్కిన్స్ కూడా ఇవ్వనున్నట్లు మైక్రోసైట్ ద్వారా తెలుస్తోంది. దీంతో బ్యాక్ ప్యానెల్ లుక్ ను నచ్చినట్లుగా మార్చుకోవచ్చు.

TECNO POP 9 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

డిస్ప్లే: అమెజాన్ మైక్రోసైట్ ప్రకారం, TECNO POP 9 5G హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో రానుంది.

చిప్సెట్: TECNO POP 9 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తోంది.

ర్యామ్, స్టోరేజీ: TECNO POP 9 5G డివైజ్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 64జిబి/128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుంది.

కెమెరా: TECNO POP 9 5G డివైజ్ లో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ఏఐ ప్రైమరీ కెమెరా ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ సెగ్మెంట్ లో ఒక ఫోన్ సోని కెమెరాతో వస్తుండటం ఇదే తొలిసారి అని కంపెనీ చెబుతోంది.

ఇతర ఫీచర్లు: TECNO POP 9 5G లో ఐపీ54 రేటింగ్, స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్, డ్యూయల్ సిమ్ 5జీ, వై-ఫై వంటి ఎన్నో ఫీచర్లు ఉంటాయి. ఫోన్‌తో పాటు 4 ఏళ్ళ ల్యాగ్-ఫ్రీ పెర్ఫామెన్స్‌ను అందిస్తున్నట్లు టెక్నో ప్రకటించింది.