
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా వీ-సిరీస్ లో రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. Vivo V40 Lite 4G, Vivo V40 Lite 5G పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు ఇండోనేషియాలో లాంచ్ అయ్యాయి. గతంలో 5జీ మోడల్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. అయితే ఈ మోడల్ కి ఇండోనేషియన్ వేరియంట్ కి తేడా ఉంది. సరే, ఓసారి Vivo V40 Lite 4G మరియు 5జీ వేరియంట్స్ యొక్క ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.
Vivo V40 Lite 4G, 5G ఫోన్ల డిజైన్
Vivo V40 Lite 4G మరియు 5జీ వేరియంట్స్ యొక్క బ్యాక్ ప్యానెల్ పై ఉన్న కెమెరా మాడ్యూల్ లో మూడు సర్క్యులర్ సెన్సర్ రింగ్స్ ఉన్నాయి. వీటికి తోడు ఆరా రింగ్ లైట్ కూడా ఉంది. అలాగే టాప్ లో డ్యూయల్ ఫ్లాష్ కూడా ఉంది. ఫోన్‌కి కుడివైపున పవర్ మరియు వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై బాటమ్ లో వివో బ్రాండింగ్ ఉంది.

Vivo V40 Lite 4G, 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Vivo V40 Lite 4G మరియు 5G మోడల్స్ లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉన్నాయి.
చిప్సెట్: Vivo V40 Lite 4G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 685 చిప్సెట్ వాడారు. Vivo V40 Lite 5G లో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ వాడారు.
ర్యామ్, స్టోరేజీ: Vivo V40 Lite 4G మరియు 5G డివైజెస్ 8జిబి వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తాయి. 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్ ఫీచర్ కూడా ఉంది.
కెమెరా: Vivo V40 Lite 5G లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, 8ఎంపి 120-డిగ్రీ అల్ట్రా-వైడ్ సెన్సర్ ఉన్నాయి. 4జీ వేరియంట్ లో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ రెండు ఫోన్లలో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ, చార్జింగ్: Vivo V40 Lite 4G, 5G డివైజెస్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.
ఓఎస్: Vivo V40 Lite 4G, 5జీ ఫోన్లు ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అయ్యాయి. 3 ఏళ్ళు ఓఎస్ అప్డేట్స్, 2 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్లకు లభిస్తాయి.
Vivo V40 Lite 4G, 5G ధరలు (అంచనా)
Vivo V40 Lite 4G 8జిబి+128జిబి మోడల్ ధర IDR 35,99,000 (సుమారు రూ.19,800) ఉండవచ్చు. 8జిబి+256జిబి మోడల్ ధర IDR 36,99,000 (సుమారు రూ.20,300) గా ఉండే అవకాశం ఉంది.
5జీ మోడల్ విషయానికి వస్తే, 8జిబి+256జిబి మోడల్ ధర IDR 42,99,000 (సుమారు రూ.23,500) గా ఉంటుంది.
Vivo V40 Lite 5G టైటానియమ్ సిల్వర్ మరియు కార్బన్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది. Vivo V40 Lite 4G మోడల్ టైటానియమ్ సిల్వర్, కార్బన్ బ్లాక్ మరియు పెర్ల్ వయొలెట్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.











