
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయబోతోంది. Vivo Y300+ పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క భారత మార్కెట్ ధర మరియు స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ ద్వారా ఈ వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.
Vivo Y300+ భారత మార్కెట్ ధర (లీక్)
ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ Vivo Y300+ యొక్క వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. టిప్‌స్టర్ తన పోస్ట్ ద్వారా ధర మరియు స్పెసిఫికేషన్స్ షేర్ చేశారు.
Vivo Y300+ భారత్ లో రూ.23,999 ధరతో లాంచ్ అవుతుందని లీక్ ద్వారా తెలుస్తోంది. ఇది 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర. ఇతర వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.
Exclusive ✨
Vivo Y300+ Indian variant pricing.
8GB+128GB 💰 ₹23,999 (Snapdragon 695 😂)📱 6.78″ FHD+ OLED display
Lol 🔳 Snapdragon 695 😂
📸 50MP+2MP rear
🤳 32MP front
🔋 5000mAh battery
⚡ 44 watt charging
– IP54 rating
– 7.57mm & 7.49mm thickness
– 183 gram & 172 gram…— Abhishek Yadav (@yabhishekhd) October 5, 2024
Vivo Y300+ స్పెసిఫికేషన్స్ (లీక్)
డిస్ప్లే: Vivo Y300+ లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, ఫుల్హెచ్డీ+ రెజుల్యూషన్ ఉంటాయి.
ప్రాసెసర్: Vivo Y300+ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ ఉంటుందని టిప్‌స్టర్ పోస్ట్ ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాసెసర్ చాలా పాతకాలం నాటిది. మరి దీన్ని ఈ ఫోన్ లో వాడటం ద్వారా యూజర్లను వివో ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిప్సెట్ వివరాల వద్ద, టిప్‌స్టర్ లాఫింగ్ ఎమోజీలను కూడా జతచేశారు. దీన్ని బట్టి వివో స్టెప్ ఏ విధంగా ఉందోనని పరోక్షంగా టిప్‌స్టర్ తెలిపినట్లయ్యింది.
ర్యామ్, స్టోరేజీ: Vivo Y300+ డివైజ్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
కెమెరా: Vivo Y300+ లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Vivo Y300+ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
బరువు, మందం: Vivo Y300+ డివైజ్ 7.57మి.మీ/7.49మి.మీ మందం, 183/172 గ్రాముల బరువు ఉంటుంది.
ఇతర ఫీచర్లు: Vivo Y300+ లో ఐపీ54 రేటింగ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ ఉంటాయి.











