
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OPPO K12 Plus పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లో విడుదలవ్వనుంది. తాజాగా ఒప్పో సంస్థ ఈ ఫోన్ యొక్క చైనా లాంచ్ తేదీని ఖరారు చేసింది. లాంచ్త తేదీతో పాటు డివైజ్ ప్రధాన స్పెసిఫికేషన్స్ కూడా కన్ఫర్మ్ చేసింది. ఓసారి లాంచ్ తేదీ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం.
OPPO K12 Plus 5G చైనా లాంచ్ తేదీ
- OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ యొక్క అఫీషియల్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ టీజర్ ద్వారా డివైజ్ లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించింది.
- OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 12వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు చైనాలో లాంచ్ అవుతుంది.
- OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ స్నో పీక్ వైట్ కలర్ ఆప్షన్ లో లాంచ్ అవుతుంది. బ్యాక్ ప్యానెల్ పై టెక్షర్డ్ డిజైన్ ఉంటుంది. దీనిలో క్రిస్టల్ డైమండ్ ప్యాటర్న్ ఫ్లాష్ శాండ్ ఫినిష్ కనిపిస్తోంది.
- OPPO K12 Plus 5G ఫోన్ బసాల్ట్ బ్లాక్ కలర్ ఆప్షన్ లో కూడా లభించనుంది. క్రింద డివైజ్ యొక్క గ్లిమ్స్‌ను మీరు చూడవచ్చు.

OPPO K12 Plus 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి మరియు అంచనా)
డిస్ప్లే: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ లో 6.7-ఇంచ్ ఫుల్హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
బ్యాటరీ, చార్జింగ్: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ లో పవర్ బ్యాకప్ కోసం 6400 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
చిప్సెట్: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది. దీనికి అడ్రెనో 720 జీపీయూ ని జతచేయనున్నారు.
ర్యామ్, స్టోరేజీ: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి, 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఉంటాయి.
కెమెరా: OPPO K12 Plus 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. మెయిన్ కెమెరా ఓఐఎస్ కి సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
సాఫ్ట్వేర్: OPPO K12 Plus 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత కలర్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
కనెక్టివిటీ: OPPO K12 Plus 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 6 ఉంటటాయి.
ఇతర ఫీచర్లు: OPPO K12 Plus 5G డివైజ్ లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుంది. ఈ ఫోన్ ఐపీ54 రేటింగ్ తో వస్తోంది. అంటే తేలికపాటి నీటి జల్లులు మరియు దుమ్ము నుంచి ఫోన్‌కి రక్షణ లభిస్తుంది.











