
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Tecno నేడు భారతీయ మార్కెట్‌లో స్పార్క్ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Tecno Spark 30C 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Tecno Spark 30C 5G ధర, సేల్ వివరాలు
Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో భారత్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ధరను రూ.8,999 గా నిర్ణయించారు. టెక్నో వెబ్‌సైట్ ద్వారా ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఫ్లిప్‌కార్ట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ లో కూడా ఫోన్ కొనవచ్చు.

Tecno Spark 30C 5G డిజైన్, కలర్స్
Tecno Spark 30C 5G స్మార్ట్‌ఫోన్‌లో పంచ్ హోల్ నాచ్ కటౌట్ ఉంది. స్క్రీన్ ఫ్లాట్ గా, కనిపించేంత బెజెల్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ ప్యానెల్ పై డ్యూయల్ కెమెరా సెటప్, రింగ్ ఎల్ఈడీ లైట్ ఉన్నాయి. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ అజూర్ స్కై, మిడ్నైట్ షాడో మరియు అరోరా క్లౌడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. అన్ని వేరియంట్స్ డ్యూయల్ టోన్ ఫినిష్ తో ఉంటాయి.
Tecno Spark 30C 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Tecno Spark 30C 5G లో 6.67-ఇంచ్ హెచ్డీ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 720*1600 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Tecno Spark 30C 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్ పై తయారైంది.
ర్యామ్, స్టోరేజీ: Tecno Spark 30C 5G డివైజ్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీని ఆఫర్ చేస్తుంది. 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా మెమొరీని గరిష్టంగా 8జిబి వరకు పెంచుకునే వీలుంది.
కెమెరా: Tecno Spark 30C 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48ఎంపి సోని ఐఎంఎక్స్582 ప్రైమరీ కెమెరా, ఏఐ సెకండరీ లెన్స్ ఉన్నాయి. వీటికి తోడు ఒక ఎల్ఈడీ ఫ్లాష్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
బ్యాటరీ, చార్జింగ్: Tecno Spark 30C 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
సాఫ్ట్‌వేర్: Tecno Spark 30C 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అయ్యింది.
కనెక్టివిటీ: Tecno Spark 30C 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, 10 5జీ బ్యాండ్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు: Tecno Spark 30C 5G లో డ్యూయల్ స్పీకర్స్, ఐపీ54 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ ఉన్నాయి.











