
ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ itel తాజాగా భారతీయ మార్కెట్‌లో itel Flip One అనే ఫోల్డబుల్ ఫీచర్ ఫోన్‌ని లాంచ్ చేసింది. తక్కువ ధరలో ఫ్లిప్ ఫోన్ కొనాలని భావించే వారికి ఇది సరైన ఎంపిక అవ్వవచ్చు. అయితే ఇది స్మార్ట్‌ఫోన్ కాదు, ఫీచర్ ఫోన్ అనే సంగతి గుర్తుంచుకోవాలి. సరే, ఓసారి ఐటెల్ ఫ్లిప్ వన్ ఫీచర్ ఫోన్ యొక్క ధర, సేల్ వివరాలు మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
itel Flip One ధర, కలర్స్, లభ్యత
itel Flip One ఫీచర్ ఫోన్ ధరను రూ.2,499 గా నిర్ణయించారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ స్టోర్స్ లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. లైట్ బ్లూ, బ్లాక్ మరియు ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
సాధారణంగా అందించే 12 నెలల వ్యారంటీ కాకుండా, మరొక నెల అదనపు వ్యారంటీని ఐటెల్ ఆఫర్ చేస్తోంది.
itel Flip One ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఐటెల్ ఫ్లిప్ వన్ స్లీక్ డిజైన్ మరియు వన్-హ్యాండ్ యూసేజ్ తో వచ్చింది. గ్లాస్ కీప్యాడ్ తో రావడం వల్లన ప్రీమియమ్ లుక్ తో కనిపిస్తుంది. బ్యాక్ ప్యానెల్ లెదర్ ఫినిష్ తో ఉంది.
డిస్ప్లే: itel Flip One లో 2.4-ఇంచ్ ఒవీజీఏ స్క్రీన్ ఇచ్చారు. ఇది క్రిస్టల్ క్లియర్ క్లారిటీని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
బ్యాటరీ: itel Flip One లో పవర్ బ్యాకప్ కోసం 1200 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. చార్జింగ్ మరియు డేటా ట్రాన్స్‌ఫర్ కోసం యూఎస్బీ టైప్-సీ పోర్ట్ ఇచ్చారు. సూపర్ బ్యాటరీ మోడ్‌లో ఈ ఫ్లిప్ వన్ డివైజ్ 7 రోజుల వరకు బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది.
ఇతర ఫీచర్లు: ఈ ఫోన్ కింగ్ వాయిస్ ఆన్-ద-గో వాయిస్ అసిస్టెన్స్ సపోర్ట్ మరియు బ్లూటూత్ కాలర్ ఫీచర్ తో రావడం వల్లన ఏ స్మార్ట్‌ఫోన్‌కైనా కనెక్ట్ అవ్వొచ్చు. దీంతో ఫీచర్ ఫోన్ నుంచి కాల్స్‌ను రిసీవ్ చేసుకోవచ్చు.
itel Flip One ఫీచర్ ఫోన్ 13 ప్రాంతీయ భాషల సపోర్ట్ తో వచ్చింది. ఈ ఫోన్ లో 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యూయల్ సిమ్ సపోర్ట్, వీజీఏ కెమెరా ఉన్నాయి.












