
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో గెలాక్సీ ఏ సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy A16 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి అడుగుపెట్టనుంది. ఇంకా లాంచ్ తేదీ రివీల్ కాలేదు. కానీ, దీపావళికి ముందు ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. అయితే ఈ ఫోన్ ఇప్పటికే గ్లోబల్‌గా లాంచ్ అయ్యింది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియన్ వేరియంట్ ప్రధాన స్పెసిఫికేషన్స్, ఫీచర్ల గురించి సమాచారం బయటకు వచ్చింది. ఓసారి ఆ విశేషాలను తెలుసుకుందాం.
Samsung Galaxy A16 5G లాంచ్ ఎప్పుడు?
Samsung Galaxy A16 5G త్వరలో భారతీయ మార్కెట్ లో లాంచ్ అవుతుందని శాంసంగ్ సంస్థ అఫీషియల్‌గా వెల్లడించింది. కొన్ని రోజుల్లో లాంచ్ తేదీ రివీల్ అవుతుంది. దీపావళి పండుగకి ముందే ఈ ఫోన్‌ని శాంసంగ్ సేల్‌కి తీసుకొచ్చే అవకాశం ఉంది.
Samsung Galaxy A16 5G స్టోరేజీ, కలర్స్
Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 4జిబి వర్చువల్ ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది. మైక్రోఎస్డీ కార్డ్ ఫెసిలిటీ కూడా ఈ ఫోన్ లో ఉంటుంది. కలర్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ గోల్డ్, లైట్ గ్రీన్, మరియు బ్లూ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లాంచ్ అవుతుంది.
Samsung Galaxy A16 5G ధర శ్రేణి (అంచనా)
Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ ధర గ్లోబల్ మార్కెట్ లో 249 యూరోలుగా ఉంది. భారతీయ కరెన్సీ ప్రకారం, దీన్ని రూ.22,000 గా చెప్పవచ్చు. అయితే, భారత మార్కెట్ ధరను ఇంకా రివీల్ చేయలేదు. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.20,000 లోపు ఉండవచ్చని భావించవచ్చు.
Samsung Galaxy A16 5G స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: Samsung Galaxy A16 5G లో 6.7-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 1080*2340 పిక్సెల్స్ రెజుల్యూషన్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
ప్రాసెసర్: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ చిప్సెట్ తో లాంచ్ కానుంది. డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ వేరియంట్ ఎగ్జినోస్ 1330 చిప్సెట్ తో లాంచ్ అయ్యింది.
ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 4జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో లాంచ్ కానుంది. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో మెమొరీని 1.5టిబి వరకు పెంచుకోవచ్చు. 4జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా యూజర్‌కి గరిష్టంగా 8జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
కెమెరా: Samsung Galaxy A16 5G స్మార్ట్‌ఫోన్ 50ఎంపి ప్రైమరీ కెమెరా, 5ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరాలతో వస్తోంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
బ్యాటరీ, చార్జింగ్: Samsung Galaxy A16 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
ఇతర ఫీచర్లు: Samsung Galaxy A16 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, వై-ఫై 5, వై-ఫై డైరెక్ట్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి. భద్రత కోసం ఈ ఫోన్ లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంటుంది.











