హైలైట్స్:
- ఒప్పో రెనో 8జెడ్ లో ట్రిపుల్ కెమెరాలు, గ్లాసీ గ్రేడియంట్ డిజైన్ ఉన్నట్లు తెలియజేస్తున్న రెండర్స్
- సీపీహెచ్2457 అనే మోడల్ నంబర్ తో గీక్ బెంచ్ పై కనిపించిన ఒప్పో రెనో 8జెడ్
- ఆండ్రాయిడ్ 12 ఓఎస్, 8జిబి ర్యామ్, స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో, ఇటీవలె భారత్ మరియు చైనాలో ఒప్పో రెనో 8, ఒప్పో రెనో 8 ప్రో ఫోన్స్ ని లాంచ్ చేసింది. ఇప్పుడు ఈ కంపెనీ ఒప్పో రెనో 8జెడ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. భారత్ లో ఈ ఫోన్ ఎఫ్ సిరీస్ క్రింద లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఒప్పో నుంచి ప్రకటన వస్తుందని వేచి చూస్తున్న తరుణంలో, ఒప్పో రెనో 8జెడ్ యొక్క హై క్వాలిటీ రెండర్ ఇమేజ్ నెట్టింట్లో ప్రత్యక్షమైంది. ప్రముఖ లీక్స్టర్ ఇవాన్ బ్లాజ్ ఈ ఇమేజ్ ని బయటకు వదిలాడు. ఒప్పో రెనో 7జెడ్ మాదిరిగా 8జెడ్ డిజైన్ కనిపిస్తోంది. ఫ్లాట్ ఫ్రేమ్, ట్రిపుల్ కెమెరా సెన్సర్స్ తో ఫోన్ కనిపిస్తోంది. మరోవైపు, 8జెడ్ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ అయిన గీక్ బెంచ్ పై కూడా కనిపించింది.
ఈమధ్య కాలంలో వస్తున్న చాలా ఫోన్ల మాదిరిగానే ఒప్పో రెనో 8జెడ్ కూడా బాక్సీ డిజైన్ ని కలిగి ఉంది. బ్యాక్ ప్యానెల్ పై గ్రేడియంట్ డిజైన్ ని కలిగి ఉంది. ఇది ఎంతో ఎలిగెంట్ గా కనిపిస్తోంది. ఇక రెండర్ ని బట్టి రెనో 8జెడ్ స్లిమ్ ప్రొఫైల్ ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
OPPO Reno 8Z డిజైన్
ఒప్పో రెనో 8జెడ్ డిజైన్ చూస్తే, అచ్చంగా రెనో 7జెడ్ మాదిరి కనిపిస్తోంది. ఈ ఫోన్ బంగారు వర్ణంలో కనిపిస్తోంది. ఫోన్ కి ఎడమవైపున సిమ్ ట్రే తో పాటు, వాల్యూమ్ రాకర్ ఉంది. పైన భాగంలో సెకండరీ మైక్రోఫోన్ ఉంది. బ్యాక్ ప్యానెల్ పై రెక్ట్యాంగులర్ మాడ్యూల్ లో రెండు భారీ కెమెరాలు ఉన్నాయి. మరోవైపు ఒక థర్డ్ సెన్సర్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సైడ్ ఫ్రేమ్ అల్యూమినియమ్ తో తయారైనట్లు అనిపిస్తోంది. రెండర్ ఇమేజ్ లో ఫోన్ ముందుభాగం కనిపించలేదు. అయితే ముందు పంచ్-హోల్ కటౌట్ ఉంటుందని మేం అంచనా వేస్తున్నాం. ఎన్సీసీ లైవ్ ఇమేజెస్ ని బట్టి ఫోన్ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం జాక్ ని కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక పవర్ బటన్ ఫోన్ కి కుడివైపున ఉన్నట్లు తెలుస్తోంది.
గీక్బెంచ్ పై కనిపించిన OPPO Reno 8Z
ఒప్పో రెనో 8జెడ్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్ బెంచ్ పై కనిపించింది. ఈ విషయాన్ని మైస్మార్ట్ప్రైస్ గుర్తించింది. లిస్టింగ్ ని బట్టి, సీపీహెచ్2457 అనే మోడల్ నంబర్ తో ఫోన్ కనిపిస్తోంది. లిస్టింగ్ పలు కీలక ఫీచర్లను తెలియజేస్తోంది.
మదర్ బోర్డ్ సెక్షన్ లో హోలీ అని పేర్కొనబడి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695, 619 జీపీయూ కి సంబంధించిన సూచికలా అనిపిస్తోంది. సింగిల్ కోర్ టెస్ట్ లో రెనో 8జెడ్ 687 పాయింట్లను సాధించగా, మల్టీ కోర్ టెస్ట్ లో 1920 పాయింట్లను సాధించింది.













