హైలైట్స్:
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అయిన మోటో జీ62
- భారత్ లో మోటో జీ62 ధర రూ.17,999 నుంచి ప్రారంభం
- హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్లకు క్రెడిట్ కార్డ్ పై రూ.1,750 డిస్కౌంట్
భారత్ లో మోటో జీ62 ఫోన్ ని మోటోరోలా ఇండియా లాంచ్ చేసింది. గురువారం నాడు కంపెనీ నుంచి మోటో జీ62 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. మోటో జీ సిరీస్ ఫోన్లలో దేశంలో ఇది ఏడో ఫోన్ కావడం విశేషం. ఈ ఫోన్ మోటో జీ32 తో దగ్గరి పోలికలను కలిగి ఉంది. కొన్ని రోజుల క్రితమే మోటో జీ32 భారత్ లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. భారత్ లో మోటో జీ62 ధర, స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 5జీ కనెక్టివిటీతో మోటో జీ62 వస్తోంది.
భారత్ లో Moto G62 ధర, బ్యాంక్ ఆఫర్లు, లభ్యత
మోటో జీ62 స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి మరియు 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. వీటి ధరలు వరుసగా రూ.17,999 మరియు రూ.19,999 గా ఉన్నాయి. హెచ్డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే రూ.1750 డిస్కౌంట్ లభించనుంది. అలాగే రూ.549 విలువ గల జీ5 ఓచర్, రూ.500 విలువ గల మింత్రా ఓచర్ లభిస్తాయి. ఇవి కొత్త మరియు పాత రిలయన్స్ జియో కస్టమర్లకు వర్తిస్తాయి. ఆగస్టు 19 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ మరియు ఆఫ్ లైన్ రిటైలర్స్ ద్వారా ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
Moto G62 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
మోటో జీ62 స్మార్ట్ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ను అమర్చారు. భారత్ లో ఇది 12 బ్యాండ్స్ లో 5జీ కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. 6జిబి+128జిబి, 8జిబి+128జిబి వేరియంట్లలో లభిస్తుంది. మోటో జీ62 లో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ ఇందులో ఉన్నాయి.
ఇప్పుడు మోటో జీ62 యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. ఈ ఫోన్లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్/డెప్త్ సెన్సర్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు. ఇది సెంటర్ పంచ్ హోల్ లో ఉండనుంది.
ఇప్పుడు మోటో జీ62 యొక్క బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ నియర్-స్టాక్ ఆండ్రాయిడ్ 12 అనుభూతిని అందిస్తుంది. ఈ ఫోన్లో ఐపీ52 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉండటం విశేషం. ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. స్టీరియో ఆడియో డెలివరీ కోసం స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్ ను కలిగి ఉన్నాయి.













