లాంచ్ అయిన Xiaomi MIX Fold 2, Xiaomi Pad 5 Pro

హైలైట్స్:

  • చైనాలో లాంచ్ అయిన షావోమీ మిక్స్ ఫోల్డ్ 2, షావోమీ ప్యాడ్ 5 ప్రో
  • కస్టమ్-డెవలప్డ్ మైక్రో వాటర్‌డ్రాప్ హింజ్ ని కలిగి ఉన్న మిక్స్ ఫోల్డ్ 2, తెరచినప్పుడు దీని వెడల్పు 5.4 మిల్లీమీటర్లు
  • స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, 2.5కే డిస్ప్లే, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కలిగి ఉన్న షావోమీ ప్యాడ్ 5 ప్రో

మిక్స్ ఫోల్డ్ 2, ప్యాడ్ 5 ప్రో డివైజెస్ ని షావోమీ లాంచ్ చేసింది. ఫోల్డ్ కి సక్సెసర్ గా వచ్చింది మిక్స్ ఫోల్డ్ 2 డివైజ్. తెరచినప్పుడు దీని వెడల్పు కేవలం 5.4 మిల్లీమీటర్లు మాత్రమే కావడం విశేషం. కేవలం 87 కంపోనెంట్స్ తో కూడిన మైక్రో వాటర్‌డ్రాప్ హింజ్ ని షావోమీ డెవలప్ చేసింది. ఇది ఎంతో మన్నికైనదని షావోమీ చెబుతోంది. గుడిక్స్ తయారు చేసిన అల్ట్రాన్యారో సైడ్ కీ కెపాసిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 కలిగి ఉంది.

మరోవైపు షావోమీ ప్యాడ్ 5 ప్రో, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, 2.5కే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 12.4 అంగుళాల స్క్రీన్, డాల్బీ విజన్ వంటి ఫీచర్లను ప్యాడ్ 5 ప్రో కలిగి ఉంది.

Xiaomi MIX Fold 2, Xiaomi Pad 5 Pro ధర

షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 12జిబి+256జిబి వేరియంట్ ధర ధర ఆర్ఎంబి 8,999 (దాదాపు రూ.106,300) గా ఉంది. 12జిబి+512జిబి వేరియంట్ ధర ఆర్ఎంబి 9,999 (దాదాపు రూ.118,055) గా ఉంది. 12జిబి+1టీబీ మోడల్ ధర ఆర్ఎంబి 11,999 (దాదాపు రూ.141,700) గా ఉంది. నేటి నుంచి ఈ ఫోన్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఆగస్టు 16 నుంచి చైనాలో సేల్ కి అందుబాటులో ఉంటుంది.

షావోమీ ప్యాడ్ 5 ప్రో 12.4 6జిబి+128జిబి ధర ఆర్ఎంబి 2,999 (దాదాపు రూ.35,400) గా ఉంది. 8జిబి + 256జిబి వేరియంట్ ధర ఆర్ఎంబి 3,499 (దాదాపు రూ.41,300) గా ఉంది. 12జిబి + 512జిబి వేరియంట్ ధర ఆర్ఎంబి 4,199 (దాదాపు రూ.41,300) గా ఉంది. షావోమీ కీబోర్డ్ టైప్ ప్రొటెక్టివ్ కేసు ధర ఆర్ఎంబి 469 (రూ.5,530) గా ఉంది. షావోమీ ఇన్‌స్పిరేషన్ స్టైలస్ ధర ఆర్ఎంబి 349 (దాదాపు రూ.4,200) గా ఉంది. టాబ్లెట్ కూడా ఆగస్టు 16 నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

Xiaomi MIX Fold 2 స్పెసిఫికేషన్స్

షావోమీ మిక్స్ ఫోల్డ్ 2 లో 6.56 అంగుళాల ఫుల్ హెచ్డీ+ శాంసంగ్ అమోలెడ్ ఈ5 కవర్ డిస్ప్లే, 21:9 యాస్పెక్ట్ రేషియో, 2520*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, డాల్బీ విజన్, హెచ్డీఆర్10+, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. అలాగే 8.02 అంగుళాల 2కే+ ఈసీఓ2 ఓఎల్ఈడీ డిస్ప్లే, 4:3.55 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, 1400 నిట్స్ బ్రైట్నెస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ మడతబెట్టే ఫోన్లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్సెట్, అడ్రెనో జీపీయూ, 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి/1టీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12ఎల్ ఆధారిత ఎంఐయూఐ కస్టమ్ స్కిన్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, హై-రెజుల్యూషన్ ఆడియో, డాల్బీ అట్మాస్, డ్యూయల్ స్పీకర్స్ ఈ ఫోన్లో ఉన్నాయి. మిక్స్ ఫోల్డ్ 2 బరువు 262 గ్రాములు. 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేసే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో ఉంది.

మిక్స్ ఫోల్డ్ 2 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటిలో ఒకటి 50ఎంపి సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ కెమెరా (ఓఐఎస్), ఎఫ్/1.8 అపెర్చర్, ఎల్ఈడీ ఫ్లాష్, 13ఎంపి అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 123-డిగ్రా ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 8ఎంపి టెలీఫోటో కెమెరా 2ఎక్స్ ఆప్టికల్ జూమ్, 20ఎంపి సెల్ఫీ కెమెరా ఉన్నాయి.

స్క్రీన్ పై క్రీజ్ ని ఎలిమినేట్ చేసేందుకు హింజ్ వద్ద కార్బన్ ఫైబర్ ఫ్లోటింగ్ ప్లేట్ ని అమర్చారు. ఫోన్ తెరచినప్పుడు, ఫ్లాట్ ఫినిషింగ్ కోసం ఇది ఫ్లెక్సిబుల్ ప్యానెల్ తో పాటు ఔటర్ యూటీజీ గ్లాస్ ను లిఫ్ట్ చేస్తుంది.

Xiaomi Pad 5 Pro స్పెసిఫికేషన్స్

షావోమీ ప్యాడ్ 5 ప్రో లో 12.4 అంగుళాల 2.5కే ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్నెస్, 2560*1600 పిక్సెల్స్ రెజెల్యూషన్, హెచ్డీఆర్10, డాల్బీ విజన్, డీసీఐ-పీ3 కలర్ గేముత్, ఎంఈఎంసీ, టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, సన్‌స్క్రీన్ 3.0, ఆంబియెంట్ కలర్ టెంపరేచర్ సెన్సర్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్సెట్, 6జిబి/8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఎంఐయూఐ 13 కస్టమ్ స్కిన్, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, హై-రెజుల్యూషన్ వైర్లెస్ సర్టిఫికేషన్, డాల్బీ అట్మాస్ ఉన్నాయి.

షావోమీ ప్యాడ్ 5 ప్రో లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, పీడీఏఎఫ్, 2ఎంపి డెప్త్ సెన్సర్, 20ఎంపి సోనీ ఐఎంఎక్స్596 సెన్సర్, 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 67వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.