ఎంతో దృఢమైన ఫోన్ ని లాంచ్ చేసిన Oukitel

హైలైట్స్:

  • రగ్డ్ ఫోన్ Oukitel WP20 Pro ఫోన్ ని లాంచ్ చేసిన ఊకీటెల్
  • మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 4జిబి ర్యామ్, 6300 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • డిస్కౌంట్ తర్వాత రూ.8,736 లకే లభిస్తోన్న ఫోన్

ఊకీటెల్ సంస్థ డబ్ల్యూపీ20 సిరీస్ లో ఒక రగ్డ్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. దీని పేరు ఊకీటెల్ డబ్ల్యూపీ20 ప్రో. గతంలో కంపెనీ నుంచి వచ్చిన ఊకీటెల్ డబ్ల్యూపీ20 కి ఇది అప్ గ్రేడెడ్ వర్షన్. భారీ స్ట్రాంగ్ బ్యాటరీ, పొడవైన డిస్ప్లే, లైట్ వెయిట్ బాడీతో ఊకీటెల్ డబ్ల్యూపీ20 ప్రో స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి లాంచ్ అయ్యింది. ఇక ప్రో వర్షన్ లో మరింత స్టోరేజీ స్పేస్, స్ట్రాంగ్ హార్డ్‌వేర్ ని అందించారు.

Oukitel WP20 Pro స్పెసిఫికేషన్స్

ఊకీటెల్ డబ్ల్యూపీ20 ప్రో స్మార్ట్ ఫోన్ కఠినమైన బహిరంగ ప్రదేశాల్లో వాడేందుకు వీలుగా తయారైంది. ఐపీ68 రేటింగ్ ని కలిగిన ఈ ఫోన్, ఎంఐఎల్-ఎస్టీడీ-810హెచ్ సర్టిఫికేషన్ ని పొందింది. దీంతో ఇది వాటర్ మరియు డస్ట్ నుంచి రక్షణ పొందనుంది. 1.5 మీటర్ల ఎత్తు నుంచి పడినా ఈ ఫోన్ చెక్కు చెదరదు. ఈ ఫోన్ ని అత్యధిక వేడిమి మరియు ఒత్తిడిలో కూడా వాడుకోవచ్చు. ఇక ఈ ఫోన్ 297 గ్రాముల బరువు ఉంటుంది.

ఊకీటెల్ డబ్ల్యూపీ20 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్లను గురించి చూస్తే, ఈ ఫోన్లో 6300 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 550 గంటల స్టాండ్ బై, 55 గంటల కాలింగ్, 60 గంటల ప్లేబ్యాక్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ ని పవర్ బ్యాంక్ లాగా కూడా వాడుకోవచ్చు. ఊకీటెల్ డబ్ల్యూపీ20 ప్రో స్మార్ట్ ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫోన్లో 20ఎంపి రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు ముందు వైపున 5ఎంపి కెమెరాను అమర్చారు.

ఊకీటెల్ డబ్ల్యూపీ20 ప్రో స్మార్ట్ ఫోన్ లో 5.93 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే ను అమర్చారు. ఇది 18:9 యాస్పెక్ట్ రేషియో, 720*1440 పిక్సెల్స్ రెజుల్యూషన్ ని కలిగి ఉంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్లో మీడియాటెక్ హీలియో ఏ22 చిప్ ని అమర్చారు. ఇక ఈ ఫోన్ 4జిబి ర్యామ్, 64జిబి స్టోరేజీ తో వస్తోంది. కాంటాక్ట్ లెస్ పేమెంట్స్ జరిపేందుకు ఈ ఫోన్లో ఎన్ఎఫ్‌సీ ని అందించారు. అలాగే భద్రత కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్ అమర్చారు. ఊకీటెల్ డబ్ల్యూపీ20 ప్రో స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేయనుంది.

Oukitel WP20 Pro ధర

ఊకీటెల్ డబ్ల్యూపీ20 ప్రో స్మార్ట్ ఫోన్ నలుపు, ఆకుపచ్చ రంగుల వేరియంట్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ ని అలీఎక్స్‌ప్రెస్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధర 109.99 డాలర్లు (దాదాపు రూ.8,736) గా ఉంది. ఈ డిస్కౌంట్ ధర ఆగస్టు 26 వరకు అందుబాటులో ఉంటుంది.

Previous article50ఎంపి కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో లాంచ్ కానున్న OPPO A57s
Next articleనిఖిల్ నటించిన కార్తికేయ 2 OTT అప్డేట్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.