హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన ఇన్ఫినిక్స్ హాట్ 12
- 6.82-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎస్ఓఎస్ కస్టమ్ స్కిన్, 18వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
- ఇన్ఫినిక్స్ హాట్ 12 ధర రూ.9,499
భారతదేశంలో ఇన్ఫినిక్స్ హాట్ 12 ఫోన్ లాంచ్ అయ్యింది. బ్రాండ్ నుంచి ఇది లేటెస్ట్ హాట్-సిరీస్ ఫోన్. బ్యాక్ ప్యానెల్ పై యూనిక్ టెక్షర్డ్ ఫినిష్ ని కలిగి పట్టుకున్నప్పుడు మంచి గ్రిప్ ఉండనుంది. సెల్ఫీ కెమెరా కోసం ఇందులో వాటర్ డ్రాప్ నాచ్ ఇచ్చారు. ఇక భద్రత కొరకు రియర్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు. అలాగే రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో ట్రిపుల్ కెమెరా సెన్సర్స్, ఎల్ఈడీ ఫ్లాస్ ఉన్నాయి. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపి ప్రైమరీ కెమెరా, భారీ డిస్ప్లే ఈ ఫోన్ యొక్క టాప్ సెల్లింగ్ పాయింట్స్ అని చెప్పవచ్చు.
ఇన్ఫినిక్స్ హాట్ 12 లో 6.82 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, ఎక్స్ఓఎస్ కస్టమ్ స్కిన్, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
భారత్ లో Infinix Hot 12 ధర, అమ్మకం
ఇన్ఫినిక్స్ హాట్ 12 ధరను రూ.9,499 గా నిర్ణయించారు. కాగా, ఈ ఫోన్ 7-డిగ్రీ పర్పుల్, టర్కాయిస్ సైయన్, ఎక్స్ప్లోరేటరీ బ్లూ, పోలార్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 23 నుంచి ఈ హ్యాండ్సెట్ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ కి వస్తోంది.
Infinix Hot 12 స్పెసిఫికేషన్స్
- 6.82-ఇంచ్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే
- మీడియాటెక్ హీలియో జీ37 చిప్
- ఆండ్రాయిడ్ 11, ఎక్స్ఓఎస్ 10
- 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
- 50ఎంపి + 2ఎంపి + ఏఐ ట్రిపుల్ కెమెరాలు
- 8ఎంపి సెల్ఫీ కెమెరా
ఇన్ఫినిక్స్ హాట్ 12 లో 6.82 అంగుళాల హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1640*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, 480 నిట్స్ బ్రైట్నెస్, 20.5:9 యాస్పెక్ట్ రేషియో, మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్, 4జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 64జిబి స్టోరేజీ, 1టీబీ ఎక్స్పాండబుల్ మెమొరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారిత ఎక్స్ఓఎస్ 10 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, డీటీఎస్ సరౌండ్ సౌండ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, 50ఎంపి రియర్ కెమెరా, క్వాడ్ ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి డెప్త్ సెన్సర్, ఏఐ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
ఇన్ఫినిక్స్ హాట్ 12 ధర రూ.9,499 నిర్ణయించారు. ఈ ధరలో హాట్ 12 మంచి ఫీచర్లనే అందిస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా భారీ డిస్ప్లే, 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 50ఎంపి రియర్ కెమెరా, 8ఎంపి ఫ్రంట్ కెమెరా డ్యూయల్ ఫ్లాష్ వంటి ఫీచర్లు ఫోన్లో హైలైట్స్ గా నిలవనున్నాయి.













