హైలైట్స్:
- భారత్ లో లాంచ్ అయిన నెల రోజులకు పెరిగిన నథింగ్ ఫోన్ (1) ధర
- కరెన్సీ ఎక్చేంజ్ రేట్స్ లో హెచ్చు తగ్గులు, కంపోనెంట్స్ ధరలు పెరగడం వంటివి ఫోన్ ప్రైస్ పెరగడానికి గల కారణాలని తెలిపిన కంపెనీ
- ఇప్పుడు నథింగ్ ఫోన్ (1) 8జిబి + 128జిబి యూనిట్ ధర రూ.33,999
కెమెరాకు సంబంధించిన అప్డేట్ వచ్చిన గంటల వ్యవధిలోనే నంథిగ్ ఫోన్ (1) ధరను పెంచుతూ కంపెనీ ఓ ప్రకటన చేసింది. నథింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, మను వర్మ ట్విట్టర్ ద్వారా ధర పెంపు ప్రకటన చేశారు. కరెన్సీ ఎక్చేంజ్ రేట్స్ హెచ్చు తగ్గులు, కంపోనెంట్ ధరలు పెరగడం వల్లన ఫోన్ (1) ప్రైస్ పెరిగినట్లు నథింగ్ కంపెనీ చెప్పింది. కొన్ని రోజుల క్రితం పాత ధరకే ఫ్లిప్ కార్ట్ లో ఫోన్ (1) సేల్ కి వచ్చింది. అయితే ప్రస్తుతం నథింగ్ ఫోన్ (1) కొనాలనుకునే వారు ఫోన్ కి ఎక్కువ ధర చెల్లించాల్సిందే. మరి నథింగ్ ఫోన్ (1) పెరిగిన ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Thank you for the love shown towards Phone (1)!
With fluctuating currency exchange rates & rising component costs, we had to change prices.
Starting today, Phone (1) will be available @flipkart for 8GB/128GB (INR 33,999), 8GB/256GB (INR 36,999), and 12GB/256GB (INR 39,999).
— Manu Sharma (@buildingnothing) August 18, 2022
నథింగ్ ఫోన్ (1) కొత్త ధరలను కంపెనీ ప్రకటించింది. 8జిబి + 128జిబి బేస్ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది. 8జిబి + 256జిబి యూనిట్ ధర రూ.36,999 గా ఉంది. ఇక టాప్ మోడల్ 12జిబి + 256జిబి వేరియంట్ ధర రూ.39,999 గా ఉంది. ఫ్లిప్ కార్ట్ ద్వారా మీరు ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. నలుపు, తెలుపు రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంది.
Nothing Phone (1) స్పెసిఫికేషన్స్
నథింగ్ ఫోన్ (1) లో గ్లైఫ్ ఇంటర్ఫేస్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, అడ్రెనో 642 జీపీయూ, 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ వంటి ఫీచర్లు ఉన్నాయి.
నథింగ్ ఫోన్ (1) లో 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి. అయితే 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నప్పటికీ, 700 నిట్స్ వరకే ఉపయోగించుకోగలుగుతున్నామని యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. మరి ఇది సాఫ్ట్‌వేర్ అప్డేట్ తో సెట్ అవుతుందో లేదో చూడాలి.
నథింగ్ ఫోన్ (1) లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్, ఈఐఎస్ సపోర్ట్ కలిగిన 50ఎంపి ప్రైమరీ, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరాలున్నాయి. ఈ రెండింట్లో ఒకటి సోనీ సెన్సర్ కాగా, మరొకటి శాంసంగ్ సెన్సర్. గ్లైఫ్ ఇంటర్ఫేస్ తో పాటు, రియర్ కెమెరాలు కూడా ఈ ఫోన్ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అని చెప్పవచ్చు. సెల్ఫీలు తీసుకునేందుకు, వీడియో కాల్స్ మాట్లాడేందుకు ఫోన్ ముందు వైపున 16ఎంపి కెమెరాను అమర్చారు.
నథింగ్ ఫోన్ (1) లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. 15 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్ ఇందులో ఉంది. నథింగ్ ఫోన్ (1) ఆండ్రాయిడ్ 12 ఆధారిత నథింగ్ ఓఎస్ పై పని చేస్తుంది. ఇక ఈ ఫోన్ మూడేళ్ళ పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, నాలుగేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని పొందనుంది. ఈ సెక్యూరిటీ ప్యాచెస్ రెండు నెలలకు ఒకసారి వస్తాయి.












