జియో, ఎయిర్టెల్ కంటే ముందే లాంచ్ కానున్న Vodafone Idea 5G సేవలు

హైలైట్స్:

  • జియో, ఎయిర్టెల్ 5జీ సేవల కంటే ముందుగానే లాంచ్ కానున్న వొడాఫోన్ ఐడియా 5జీ నెట్వర్క్
  • 5జీ కి సంబంధించి వినియోగదారులకు సందేశాలు పంపిస్తోన్న వొడాఫోన్ ఐడియా
  • త్వరలో లాంచ్ కానున్న వొడాఫోన్ ఐడియా 5జీ సేవలు, 5జీ ప్లాన్ ధరలు ఎక్కువగా ఉండటం ఖాయం

Vodafone Idea 5G Launch: 5జీ ఇంటర్నెట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న కస్టమర్లకు త్వరలోనే గుడ్ న్యూస్ రానుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలం నాటి నుంచి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు 5జీ సేవల కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ కంపెనీ కూడా 5జీ లాంచ్ తేదీని ప్రకటించలేదు. కానీ, ఈలోపు వొడాఫోన్ ఐడియా ఎగ్జిస్టింగ్ కస్టమర్లకు 5జీ లాంచ్ కి సంబంధించి సమాచారం ఇస్తోంది. ఇది ముఖ్యమైన విషయమేనని చెప్పాలి. ఎందుకంటే, ఇప్పటి వరకు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ 5జీ లాంచ్ విషయమై తమ కస్టమర్లకు ఏ మెసేజ్ ను పంపలేదు. మరి వీఐ కస్టమర్లకు కంపెనీ నుంచి ఏమని మెసేజ్ లు వస్తున్నాయో తెలుసుకుందాం పదండి.

త్వరలోనే 5G సేవలను లాంచ్ చేయనున్న Vodafone Idea

వొడాఫోన్ ఐడియా నుంచి వచ్చిన సందేశంలో ఇలా ఉంది. “శుభవార్త, వీఐ నెట్వర్క్ 5జీ కి అప్‌గ్రేడ్ అయ్యింది. మీ నెట్వర్క్ అనుభూతి ఇకపై మరింత మెరుగుపడనుంది. త్వరలోనే మీకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో సూపర్ ఫాస్ట్ వీఐ నెట్వర్క్ అందుతుంది.” అని ఆ సందేశంలో ఉంది.

ఈ సందేశం 91మొబైల్స్ టీమ్ లోని ఒక సభ్యుడికి వచ్చింది. పైన దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని మీరు గమనించవచ్చు. అయితే, కంపెనీ పంపించిన సందేశంలో లాంచ్ డేట్ వివరాలు ఏమీ లేవు. కానీ, వొడాఫోన్ ఐడియా అతి త్వరలో తన యొక్క 5జీ సేవలను మొదలు పెడుతుందని అందరూ అంచనా వేస్తున్నారు.

Vodafone Idea 5G లాంచ్ డేట్

తమకు భారత్ లో కేటాయించిన తాత్కాలిక ట్రయల్ స్పెక్ట్రమ్ ను నోకియా, ఎరిక్సన్ లతో కలిసి వొడాఫోన్ పరీక్షించనుంది. అలాగే, గతంలో వచ్చిన కథనాలను బట్టి, 5జీ సేవలు 2022, సెప్టెంబర్ 29 న లాంచ్ అవుతాయని తెలుస్తోంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ సెప్టెంబర్ 29 న ఇనాగురేట్ కానుంది. ఇదే సందర్భంగా 5జీ సేవలను లాంచ్ చేసే అవకాశముంది. ఈ ఏడాది ముగిసే నాటికి వొడాఫోన్ 5జీ చాలా నగరాల్లో అందుబాటులోకి రానుందని అంచనా.

VI 5G ప్లాన్ ఖరీదు ఎక్కువే

ఇటీవలె ముగిసిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో తమ కంపెనీ భారీ పెట్టుబడి పెట్టిందని, వొడాఫోన్ ఐడియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రవీందర్ టక్కర్ కొన్ని రోజుల క్రితం చెప్పారు. దీంతో 5జీ డేటా ప్లాన్ కి ఎక్కువ ధర ఉండటం ఖాయమని స్పష్టమవుతోంది. ఈ ఏడాది చివరికల్లా అన్ని రకాల టెలీకామ్ సేవల ధరలు పెరుగుతాయని రవీందర్ టక్కర్ అంచనా వేశారు.

లేటెస్ట్ టెలీకామ్ వార్తల కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ ని విజిట్ చేయండి.