6000mAh బ్యాటరీ, 8GB ర్యామ్, 144Hz డిస్ప్లే తో లాంచ్ అయిన iQOO Z6X 5G

హైలైట్స్:

  • జెడ్-సిరీస్ లో వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తున్న స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ
  • చైనాలో లాంచ్ అయిన iQOO Z6X 5G స్మార్ట్ ఫోన్, త్వరలో భారత్ లో ఎంట్రీ ఇవ్వనున్న హ్యాండ్సెట్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్ ఈ ఫోన్లో ప్రధాన ఫీచర్లు

ఐకూ కంపెనీ జెడ్6 సిరీస్ లో వరుసబెట్టి ఫోన్లను విడుదల చేస్తోంది. త్వరలోనే భారత్ లో iQOO Z6X లేదా Z6 Lite స్మార్ట్ ఫోన్ లాంచ్ కానుంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే భారత్ లో లాంచ్ అవ్వడానికి ముందే, తన హోమ్ మార్కెట్ అయిన చైనాలో ఐకూ జెడ్6ఎక్స్ ఫోన్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 8జిబి ర్యామ్, మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

iQOO Z6x 5G స్పెసిఫికేషన్స్

iQOO Z6X 5G స్మార్ట్ ఫోన్ లో 20:9 యాస్పెక్ట్ రేషియో కలిగిన 6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే 2408*1080 రెజుల్యూషన్ ని కలిగి ఉంది. 144 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ తో ఈ ఫోన్ వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఒరిజిన్ ఓఎస్ ఓషన్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్సెట్ ని ఇందులో అమర్చారు. 6 నానోమీటర్ టెక్నాలజీ పై ఈ చిప్ తయారైంది. మాలి-జీ57 జీపీయూ ని ఇందులో అందించారు.

iQOO Z6X 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా (ఎఫ్/1.8 అపర్చర్), మ్యాక్రో లెన్స్ (ఎఫ్/2.4 అపర్చర్), ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కొరకు iQOO Z6X 5G లో ముందు వైపున 8 ఎంపి కెమెరాను అమర్చారు. ఇది ఎఫ్/2.0 అపర్చర్ ని కలిగి ఉంది.

iQOO Z6X 5G డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తోంది. ఇది 5జీ, 4జీ నెట్వర్క్స్ పై పని చేస్తుంది. భద్రత కొరకు ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని పవర్ బటన్ లో అమర్చారు. ఇక బ్యాటరీ విభాగం గురించి తెలుసుకుందాం. ఇందులో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

iQOO Z6X 5G ధర

iQOO Z6X 5G మూడు వేరియంట్లలో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ ధర CNY 1199 (దాదాపు రూ.14000) గా ఉంది. 8జిబి + 128జిబి వేరియంట్ ధర CNY 1399 (దాదాపు రూ.16,300) గా ఉంది. 8జిబి + 256జిబి వేరియంట్ ధర CNY 1599 (దాదాపు రూ.18,600) గా ఉంది. బ్లాక్, బ్లూ, ఆరెంజ్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, ఓటీటీ సమాచారం కొరకు 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.

Previous articleLiger మూవీ ఓటీటీ అప్డేట్
Next articleమీడియాటెక్ హీలియో జీ95, 64ఎంపి కెమెరాతో లాంచ్ అయిన Redmi Note 11SE
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.