Redmi Note 10 Pro Max పై రూ.5000 డిస్కౌంట్

హైలైట్స్:

  • రూ.14,999 కి అందుబాటులో Redmi Note 10 Pro Max స్మార్ట్ ఫోన్
  • ప్రైస్ కట్, కూపన్ డిస్కౌంట్, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కలుపుకుని రూ.5000 తగ్గిన Redmi Note 10 Pro Max
  • 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 108ఎంపి ప్రైమరీ కెమెరా, స్నాప్ డ్రాగన్ 732జి చిప్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు

2021 మార్చి లో Redmi Note 10 Pro Max ఫోన్ లాంచ్ అయ్యింది. రెడ్మీ నోట్ 10 సిరీస్ లో ఇదే హై-ఎండ్ డివైజ్. 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 108ఎంపి ప్రైమరీ కెమెరా, స్నాప్ డ్రాగన్ 732జి చిప్సెట్ వంటి ముఖ్య ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. రూ.19,999 ప్రారంభ ధరతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫోన్ ని తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రైస్ కట్, కూపన్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ తో ఈ ఫోన్ రూ.14,999 కి లభిస్తోంది. ఈ నెలలో ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కి ముందు ఈ ఫోన్ పై ఆఫర్ ని తీసుకొచ్చారు.

Redmi Note 10 Pro Max యొక్క తగ్గించిన ధర ఆకర్షిస్తోంది కానీ, ఈ ఫోన్ ని మీరు కొనచ్చా? ఈ మధ్య కాలంలో బాగా జనాదరణ పొందుతోన్న ఒక ముఖ్యమైన ఫీచర్ ఇందులో లేదు.

భారత్ లో Redmi Note 10 Pro Max ప్రైస్ కట్

Redmi Note 10 Pro Max 6జిబి + 128జిబి మోడల్ రూ.19,999 ధరతో, 8జిబి + 128జిబి వర్షన్ రూ.21,999 ధరతో లాంచ్ అయ్యాయి. అయితే, అమెజాన్ డీల్ లో భాగంగా, ఈ హ్యాండ్సెట్ బేస్ మోడల్ ధర రూ.17,999 కి చేరుకుంది. అదనంగా, రూ.1500 అమెజాన్ కూపన్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ధర రూ.16,499 కి తగ్గింది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం (రూ.1500 వరకు) ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుండటంతో ఫోన్ ధర మరింత తగ్గుతోంది.

Redmi Note 10 Pro Max కొనడం లాభమేనా?

తగ్గిన ధర ని బట్టి చూస్తే, Redmi Note 10 Pro Max కచ్చితంగా మంచి ఆప్షన్ అవుతుంది. ఇందులో 120 హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. అలాగే 108 ఎంపి కెమెరా ఉంది. ఇది అద్భుతమైన ఫోటోలను తీస్తుంది. దాంతో పాటు Redmi Note 10 Pro Max లో 5020 భారీ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అయితే, ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే, ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో రావడం లేదు. 4జీ కనెక్టివిటీ ఈ ఫోన్లో ఉంది. మరిన్ని రోజుల్లో 5జీ లాంచ్ ఉండటం వల్లన 5జీ కనెక్టివిటీ ఉన్న ఫోన్ ని కొనడం సరైన నిర్ణయం అవుతుంది.

Redmi Note 10 Pro Max స్పెసిఫికేషన్స్

Redmi Note 10 Pro Max 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే కలిగి ఉంది. 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+, టీయూవీ రెయిన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 732జి చిప్, అడ్రెనో 618 జీపీయూ, 8జిబి వరకు ర్యామ్, 128జిబి స్టోరేజీ, మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా ఎక్స్‌ప్యాండబుల్ మెమొరీ వంటి ఫీచర్లున్నాయి.

Redmi Note 10 Pro Max ఆండ్రాయిడ్ 11 ఆధారిత, ఎంఐయూఐ 12 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 5020 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్లో ఉన్నాయి.

Redmi Note 10 Pro Max 108ఎంపి శాంసంగ్ ఐసోసెల్ జీడబ్ల్యూ3 ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రా వైడ్ కెమెరా (120-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 5ఎంపి టెలీ-మ్యాక్రో కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి కెమెరా ఉంది.

Redmi Note 10 Pro Max లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. 4జీ ఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

Previous articleఈ నెలలో లాంచ్ కానున్న Vivo V25 5G; లీకైన ధర, స్పెసిఫికేషన్స్
Next articleసెప్టెంబర్ 13 న భారత్ లో లాంచ్ అవుతోన్న Moto Edge 30 Ultra
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.