హైలైట్స్:
- లాంచ్ అయిన GoPro Hero 11 Black, Hero 11 Black Creator Edition, Hero 11 Black mini కెమెరాలు
- 1/1.9-ఇంచ్ సెన్సర్, 10-బిట్ కలర్ వీడియో, 5.3కే రెజుల్యూషన్ GoPro Hero 11 Black ప్రధాన ఫీచర్లు
- GoPro Hero 11 Black కెమెరాల ధర రూ.41,500 నుంచి ప్రారంభం
గోప్రో సరికొత్త Hero 11 Black కెమెరాలను అనౌన్స్ చేసింది. ఈ లైనప్ లో Hero 11 Black, Hero 11 Black Creator Edition, Hero 11 Black Mini మోడల్స్ ఉన్నాయి. ఈ మూడు కెమెరాలు భారీ సెన్సర్ తో వస్తున్నాయి. ఈ సెన్సర్ 10-బిట్ కలర్ డెప్త్, హయ్యస్ట్ లెవెల్ వీడియో స్టెబిలైజేషన్, వైడెస్ట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ లను కలిగి ఉంది. ఇప్పుడు విడుదలైన ఈ లైనప్ లోని అన్ని కెమెరాలు కూడా యూజర్లను విభిన్న రీతుల్లో ఆకట్టుకుంటాయని, అలాగే వారి అవసరాలకు తగిన విధంగా ఉంటాయని గోప్రో కంపెనీ తెలిపింది.
GoPro Hero 11 Black series హైపర్‌స్మూత్ 5.0 టెక్నాలజీని కలిగి ఉంది. ఫుటేజీని స్టడీగా ఉంచేందుకు ఈ టెక్నాలజీ దోహదపడుతుంది. కెమెరా 360 డిగ్రీస్ లో రొటేట్ అయినప్పటికీ అదే స్టెబిలిటీని అందిస్తుంది. సరికొత్త హైపర్-ఇమ్మర్సివ్ హైపర్వ్యూ డిజిటల్ లెన్స్ వైడెస్ట్ యాంగిల్ 16:9 షాట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది.
భారత్ లో GoPro Hero 11 Black ధర, విక్రయ తేదీ
GoPro Hero 11 Black భారత్ లో రూ.51,500 కు లభ్యమవుతుంది. ఇక క్రియేటర్ ఎడిషన్ ధర రూ.71,500 గా ఉంది. అక్టోబర్ మూడో వారం నుంచి వీటి విక్రయాలు మొదలవుతాయి. GoPro Hero 11 Black Mini ధర రూ.41,500 గా ఉంది. నవంబర్ నుంచి ఈ కెమెరా సేల్ కి వస్తోంది. Hero 11 Black సిరీస్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ రిటైల్ పార్ట్నర్స్ (అమెజాన్, ఫ్లిప్ కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్, విజయ్ సేల్స్ తో సహా) ద్వారా అమ్మకానికి వస్తుంది.
GoPro Hero 11 Black స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
GoPro Hero 11 Black కంపెనీ యొక్క నిరూపితమైన హీరో కెమెరా డిజైన్, డ్యూరబులిటీ, పెర్ఫామెన్స్ ని కలిగి ఉంది. ప్రొఫెషనల్స్, ఔత్సాహికులు ఇమ్మర్సివ్ ఫుటేజీని క్యాప్చర్ చేసే పనితనాన్ని ఈ కెమెరా కలిగి ఉంటుందని కంపెనీ చెబుతోంది.
GoPro Hero 11 Black Creator Edition ఆల్-ఇన్-వన్ కంటెంట్ క్యాప్చరింగ్ పవర్‌హౌజ్ గా పిలవబడుతోంది. దీని ద్వారా వ్లాగింగ్, ఫిల్మ్‌మేకింగ్, లైవ్-స్ట్రీమింగ్ వంటివి తేలిగ్గా చేయవచ్చు. ఇంకా ఇది అల్ట్రా-లైట్ వెయిట్ డిజైన్ ని కలిగి అరచేతిలో ఇట్టే ఇమిడి పోతుంది. ఈ కెమెరా లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ, బిల్ట్-ఇన్ బటన్స్ ని కలిగి ఉంది. ఒక్క చేతితో కెమెరాను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. ఒక్కసారి చార్జి చేస్తే, నాలుగు గంటల పాటు 4కే రికార్డింగ్ ని చేయవచ్చు.
GoPro Hero 11 Black Mini ఒక చిన్న, తక్కువ బరువు గల కెమెరా. మిగతా మోడల్స్ మాదిరే మంచి పెర్ఫామెన్స్ దీని సొంతం.













