Dimensity 900 చిప్, 50MP కెమెరా, 44W ఫాస్ట్ చార్జింగ్ తో లాంచ్ అయిన Vivo V25: ధర, స్పెసిఫికేషన్స్, లభ్యత

హైలైట్స్:

  • భారత్ లో లాంచ్ అయిన Vivo V25, నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం
  • 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, మీడియాటెక్ డైమెన్సిటీ 900, 50ఎంపి సెల్ఫీ సెన్సర్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ఈ ఫోన్ ప్రధాన ఫీచర్లు
  • భారత్ లో Vivo V25 ధర రూ.27,999 నుంచి ప్రారంభం

భారత్ లో Vivo V25 లాంచ్ అయ్యింది. ఇది వీ-సిరీస్ లో వచ్చిన లేటెస్ట్ ఫోన్. ఇటీవలె వివో నుంచి వివో వీ25 ప్రో ఫోన్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. Vivo V25 విషయానికి వస్తే, ఇందులో వాటర్ డ్రాప్ నాచ్, సెల్ఫీ కెమెరా, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, ట్రిపుల్ రియర్ కెమెరా, యూనిక్ గ్రేడియంట్ డిజైన్ ఉన్నాయి.

Vivo V25 ఫోన్ కలర్ చేంజింగ్ ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తో వస్తోంది. వివో వీ25 ప్రో లో కూడా ఇలాంటి బ్యాక్ ప్యానెల్ ని మనం చూశాం. Vivo V25 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, 50ఎంపి సెల్ఫీ కెమెరా, ఆండ్రాయిడ్ 12 ఓఎస్ కలిగి ఉంది. భారత్ లో Vivo V25 ధర, ప్రీ-బుకింగ్ వివరాలు, పూర్తి స్పెసిఫికేషన్స్ పై ఓ కన్నేద్దాం పదండి.

భారత్ లో Vivo V25 ధర, ప్రీ-బుకింగ్ వివరాలు

Vivo V25 8జిబి + 128జిబి మోడల్ ధర రూ.27,999 గా ఉంది. 12జిబి + 256జిబి ధర రూ.31,999 గా నిర్ణయించారు. ఈ హ్యాండ్సెట్ సర్ఫింగ్ బ్లూ, ఎలిగెంట్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో వస్తోంది. Vivo V25 ఫోన్ ని ఫ్లిప్ కార్ట్, వివో ఆన్‌లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్ కార్ట్, వివో వెబ్ సైట్ ద్వారా నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ ఫోన్ ని ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుకింగ్ కస్టమర్లు ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ కార్డ్స్ ద్వారా 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అదనంగా రూ.2,000 డిస్కౌంట్ కూడా లభించనుంది.

Vivo V25 సేల్ డేట్ ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అదే తేదీ నుంచి Vivo V25 సేల్ కి వచ్చే అవకాశం ఉంది.

Vivo V25 స్పెసిఫికేషన్స్

Vivo V25 లో 6.44 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్, 8జిబి/12జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ, మెమొరీ ఎక్స్‌పాన్షన్ వయా ఎస్డీ కార్డ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్, ఫన్ టచ్ 12 కస్టమ్ స్కిన్, 8జిబి ఎక్స్‌టెండబుల్ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Vivo V25 లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5జీ, 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 5.2, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.

Vivo V25 లో 64ఎంపి ప్రైమరీ సెన్సర్, 8ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. రియర్ కెమెరాలో నైట్ మోడ్, పొట్రెయిట్, సూపర్-మ్యాక్రో, హై రెజుల్యూషన్, పనోరమా, లైవ్ ఫోటో, స్లో మోషన్, టైమ్-లాప్స్, ప్రో, ఏఆర్ స్టికర్స్, వ్లాగ్ మోడ్, డాక్యుమెంట్స్, డబుల్ ఎక్స్‌పోజర్, డ్యూయల్ వ్యూ వంటి ఫీచర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

Previous articleGoogle Pixel Mini పై పని చేస్తున్న గూగుల్
Next articleభారత్ లో లాంచ్ అయిన OPPO F21s Pro 4G, OPPO F21s Pro 5G: ధర, స్పెసిఫికేషన్స్
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.