హైలైట్స్:
- దీపావళి 2022 సేల్ ని ప్రకటించిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ OnePlus
- సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకు కొనసాగనున్న సేల్, స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్ తదితర ఉపకరణాలపై డిస్కౌంట్లు
- యాక్సిస్ బ్యాంక్ కార్డ్ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోన్న OnePlus
అన్ని ప్రముఖ బ్రాండ్స్, అలాగే ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ పండుగ సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్స్ తో జనాల ముందుకు వచ్చాయి. నేడు వన్ప్లస్ కూడా తన దీపావళి సేల్ ని ప్రకటించింది. సెప్టెంబర్ 22 న మొదలై సెప్టెంబర్ 23 న ఈ సేల్ ముగుస్తుంది. ఈ సేల్ లో వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ టీవీలు, వేరబుల్స్, ఇతర యాక్ససరీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ వచ్చాయి. యాక్సిస్ బ్యాంక్ యూజర్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మరి ఈ సేల్ సమయంలో ఏయే OnePlus స్మార్ట్ ఫోన్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయో తెలుసుకుందాం పదండి.
OnePlus 10 Pro డీల్
OnePlus 10 Pro ఫ్లాగ్షిప్ డివైజ్ సాధారణ రోజుల్లో ధర రూ.66,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా వన్ ప్లస్ వెబ్ సైట్ లో దీని ధర రూ.61,999 కి తగ్గింది. కస్టమర్లు యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ లేదా ఈఎంఐ లావాదేవీల ద్వారా కొనుగోలు చేస్తే అదనంగా రూ.6000 డిస్కౌంట్ పొందుతారు. దీంతో OnePlus 10 Pro ధర రూ.55,999 కి తగ్గుతుంది.
OnePlus 10 Pro స్పెసిఫికేషన్స్
- 6.7-ఇంచ్ ఎల్టీపీవో డిస్ప్లే
- 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్
- 12జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ
- 48ఎంపి+50ఎంపి+8ఎంపి ట్రిపుల్ కెమెరాలు
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus 10R సేల్ ధర
సాధారణ రోజుల్లో OnePlus 10R ధర రూ.38,999 గా ఉంది. అయితే దీపావళి సేల్ సందర్భంగా దీని ధర రూ.32,999 కి తగ్గింది. ఇతర డిస్కౌంట్స్ కూడా కలిపితే కొనుగోలుదారులకు మరో రూ.3000 అదనపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.29,999 కి తగ్గుతుంది.
OnePlus 10R స్పెసిఫికేషన్స్
- 6.7-ఇంచ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 8100మ్యాక్స్ చిప్
- 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
- 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాలు
- 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus 10T 5G ఆఫర్ ధర
OnePlus 10T 5G ఫోన్ రీసెంట్ గా లాంచ్ అయ్యింది. భారత్ లో దీని ప్రారంభ ధర రూ.49,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ఈఎంఐ ద్వారా OnePlus 10T 5G ఫోన్ కొంటే రూ.5000 డిస్కౌంట్ లభిస్తోంది.
OnePlus 10T 5G స్పెసిఫికేషన్స్
- 6.7-ఇంచ్ డిస్ప్లే,120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 చిప్
- 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
- 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ కెమెరాస్
- 4800ఎంఏహెచ్ బ్యాటరీ, 150 వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus Nord 2T 5G
ఈ ఏడాది జులై నెలలో OnePlus Nord 2T 5G ఫోన్ లాంచ్ అయ్యింది. భారత్ లో ఈ ఫోన్ ధర రూ.28,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా ఈ ఫోన్ పై డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా ఈ ఫోన్ కొంటే రూ.4000 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఫోన్ ధర రూ.24,999 కి తగ్గుతుంది.
OnePlus Nord 2T 5G స్పెసిఫికేషన్స్
- 6.43-ఇంచ్ డిస్ప్లే, 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 1300 చిప్
- 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీ
- 50ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
- 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus Nord CE 2 5G
భారత్ లో OnePlus Nord CE 2 5G ధర రూ.23,999 గా ఉంది. వన్ ప్లస్ దీపావళి సేల్ సందర్భంగా కొనుగోలుదారులు రూ.22,499 కి ఈ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ మరియు ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా OnePlus Nord CE 2 5G ఫోన్ ని కొంటే రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది.
OnePlus Nord CE 2 5G స్పెసిఫికేషన్స్
- 6.43-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్
- 64ఎంపి + 8ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
- 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ చార్జింగ్
OnePlus Nord CE 2 Lite 5G పై డిస్కౌంట్
భారత్ లో లభిస్తోన్న వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ లో కెల్లా తక్కువ ధర కలిగిన ఫోన్ OnePlus Nord CE 2 5G. సాధారణ రోజుల్లో దీని ధర రూ.19,999 గా ఉంది. అయితే దీపావళి సేల్ సందర్భంగా దీనిపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా OnePlus Nord CE 2 Lite 5G ఫోన్ ని కొంటే అదనంగా రూ.1500 డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ ఫోన్ ని రూ.17,499 కే సొంతం చేసుకోవచ్చు.
OnePlus Nord CE 2 5G స్పెసిఫికేషన్స్
- 6.59-ఇంచ్ డిస్ప్లే, 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
- మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్
- 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ
- 64ఎంపి + 2ఎంపి + 2ఎంపి ట్రిపుల్ రియర్ కెమెరాలు
- 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్












