హైలైట్స్:
- మార్కెట్ లోకి 2 కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన Hisense కంపెనీ
- టీవీ కొనుగోలు పై రూ.5,999 విలువ గల 4K Fire TV Stick ఉచితం
- అమెజాన్ ద్వారా సేల్ కి వచ్చిన U7H TV, A7H Tornado 2.0

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ Hisense నేడు భారత్ లో రెండు కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. U7H TV, A7H Tornado 2.0 అనే రెండు మోడల్స్ ని హైసెన్స్ మార్కెట్ లోకి వదిలింది. ఈ రెండు టీవీలు ప్రస్తుతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. కొత్తగా లాంచ్ అయిన ఈ టీవీల్లో 4కే ప్యానెల్, డాల్బి విజన్, డాల్బి అట్మాస్ ఆడియో సపోర్ట్ ఉన్నాయి.
ఇంకా 65-ఇంచ్ క్యూఎల్ఈడీ టీవీ అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4కే, హై వ్యూ ఇంజిన్ తో వస్తోంది. మరోవైపు, 55-ఇంచ్ వర్షన్ గూగుల్ టీవీ, గూగుల్ ప్లే స్టోర్ ఫుల్ యాక్సెస్ తో వస్తోంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి.
భారత్ లో U7H TV, A7H Tornado 2.0 స్మార్ట్ టీవీల ధరలు, లభ్యత
Hisense U7H సిరీస్ 55-ఇంచ్ టీవీ ధర రూ.51,990 గా ఉంది. ఇక 65-ఇంచ్ మోడల్ ధర రూ.71,990 గా ఉంది. A7H Tornado 2.0 ధర రూ.42,990 గా నిర్ణయించారు. ఈ మూడు వేరియంట్లు అమెజాన్ లో కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి.
Hisense U7H TV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు

Hisense U7H TV రెండు స్క్రీన్ సైజెస్ లో వస్తోంది. అవి: 55-అంగుళాలు, 65-అంగుళాలు. ఈ ఒక్క మార్పు తప్పితే, మిగతా స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఈ రెండు టీవీల్లో ఒకే విధంగా ఉంటాయి. Hisense U7H TV సిరీస్ 4కే అల్ట్రా స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్యూఎల్ఈడీ ప్యానెల్, లైట్ డిమ్మింగ్, లైట్ సెన్సింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లతో వస్తోంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం ఈ టీవీలకు బిగ్ ప్లస్. ఎందుకంటే దాదాపుగా ఇతర టీవీలు ఏవీ ఈ రేంజ్ లో రిఫ్రెష్ రేట్ కలిగి లేవు.
ఇకపోతే, ఈ టీవీలు ఎంఈఎంసీ, వైడ్ కలర్ గేముత్, 6ఎంఎస్ రెస్పాన్స్ టైమ్, డాల్బి విజన్ ఐక్యూ, హెచ్డీఆర్10+, ఏఎండీ ఫ్రీసింక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. అదనంగా ఈ టీవీలు బాక్స్ లో ఫైర్ టీవీ స్టిక్ 4కే తో వస్తున్నాయి. యూట్యూబ్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యప్‌టీవీ తదితర ఎన్నో యాప్స్ ఈ టీవీలో ఉన్నాయి. అయితే ఈ టీవీ ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్ లేదా గూగుల్ టీవీ పై పని చేయదు.
Hisense U7H TV లో 20వాట్ సౌండ్ ఔట్పుట్, డాల్బి అట్మాస్, డీటీఎస్ ఎక్స్, ఈఏఆర్సీ, డాల్బి డిజిటల్ సపోర్ట్ ఉన్నాయి. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఇందులో 4హెచ్డీఎంఐ పోర్ట్స్ వర్షన్ 2.1, యూఎస్బీ 3.0, యూఎస్బీ 2.0 పోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 ఉన్నాయి.
Hisense A7H Tornado 2.0 టీవీ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
ఈ 4కే టీవీ 3840*2160 అల్ట్రా హెచ్డీ రెజుల్యూషన్ తో వస్తోంది. అయితే ఇది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే కలిగి ఉంది. ఆడియో ఔట్పుట్ ఈ టీవీలో హైలైట్ పాయింట్ అని చెప్పాలి. Hisense A7H Tornado 2.0 టీవీ 102 వాట్స్ సౌండ్ ఔట్పుట్ ని కలిగి ఉంది. ఇందులో 6 జెబిఎల్ స్పీకర్స్ ఉన్నాయి. డాల్బి అట్మాస్ సపోర్ట్ కూడా ఈ టీవీలో ఉంది.
ఈ స్మార్ట్ టీవీ గూగుల్ టీవీ ఓఎస్ పై పని చేస్తుంది. గూగుల్ సర్వీసెస్ తో పాటు, 10 వేలకు పైగా యాప్స్, గేమ్స్ ని ఈ ఓఎస్ సాయంతో పొందవచ్చు. ఈ టీవీ డాల్బి విజన్, హెచ్డీఆర్10 సపోర్ట్ ని కలిగి ఉంది. హెచ్డీఎంఐ పోర్ట్స్, 2 యూఎస్బీ పోర్ట్స్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ 5.1 వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఈ టీవీలో ఉన్నాయి. క్రోమ్‌కాస్ట్, ఆపిల్ ఎయిర్‌ప్లే, హోమ్ కిట్, గేమ్ మోడ్ తదితర ఎన్నో ఇతర ఫీచర్లు Hisense A7H Tornado 2.0 లో ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












