హైలైట్స్:
- 5జీ నెట్వర్క్ లాంచ్ కోసం ఎదురు చూస్తోన్న యావత్ దేశం
- మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న 5జీ సేవలు
- తొలి దశలో ప్రధాన నగరాలకు మాత్రమే పరిమితం కానున్న 5జీ నెట్వర్క్
యావత్ దేశం 5జీ లాంచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తోంది. అయితే ఆ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ పడనుంది. మరొక నాలుగు రోజుల్లో దేశంలో 5జీ సేవలు మొదలు కానున్నాయి. అక్టోబర్ 1 న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 5జీ నెట్వర్క్ ని ప్రారంభించనున్నారు. అక్టోబర్ 1 న జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉంటుందని నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ తన ట్విట్టర్ హ్యాండిల్ పై ప్రకటించింది.
దీపావళి నాటికి ఎయిర్టెల్ 5జీ, జియో 5జీ, వీఐ 5జీ సేవలు కూడా ప్రారంభమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఎన్బీఎస్ తన ట్వీట్ ని ఓ రోజు తర్వాత తొలగించింది. దీంతో అసలు గందరగోళం మొదలైంది. 5జీ సేవలు అక్టోబర్ 1 నే మొదలవుతాయా? లేక ఇంకా జాప్యమవుతుందా అని అందరిలో ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
అక్టోబర్ 1 న 5G సేవలు లాంచ్ అవుతాయా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అక్టోబర్ 1 న జరిగే ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో 5జీ సేవలను ప్రారంభిస్తారని నేషనల్ బ్రాడ్‌బ్యాండ్ మిషన్ తన ట్వీట్ లో తెలిపింది. కానీ ఆ ట్వీట్ ని తర్వాత ఎన్బీఎస్ తొలగించింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ నుంచి కూడా 5జీ లాంచ్ కి సంబంధించి ఎటువంటి సంకేతాలు రాలేదు. దీని బట్టి దేశంలో 5జీ సేవలు అక్టోబర్ 1 న ప్రారంభమవుతాయన్న విషయం నిరాధారమైనదిగా భావిస్తున్నారు.
అక్టోబర్ 12 న లాంచ్ కానున్న 5G
అక్టోబర్ 12 న దేశంలో 5జీ నెట్వర్క్ లాంచ్ అవుతుందని, అందుకోసం టెలీకామ్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారని కేంద్ర టెలీకామ్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అక్టోబర్ 12 న 5జీ లాంచ్ అవుతుందని, తర్వాత దేశ వ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలకు విస్తరిస్తుందని భావిస్తున్నారు. రానున్న రెండు మూడేళ్ళలో దేశంలో ఉన్న అన్ని మారుమూల ప్రాంతాలకు 5జీ సేవలు వ్యాపించాలని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
5జీ సేవలు భారత్ లో 2022 ఆగస్టు 15 వ తేదీన లాంచ్ అవుతాయని 5జీ స్పెక్ట్రమ్ వేలం ముగిసాక వార్తలు వచ్చాయి. కానీ, అది జరగలేదు. అదే విధంగా జియో, ఎయిర్టెల్ సంస్థలు దీపావళి కి 5జీ నెట్వర్క్ లాంచ్ చేస్తామని తెలిపాయి. మరి ఇది జరుగుతుందో లేదో చూడాలి.
తొలి దశలో 5జీ సేవలు పొందే నగరాలివే
తొలిదశలో దేశంలోని 13 ప్రధాన నగరాలకు 5జీ సేవలు ప్రారంభమవుతాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ వెల్లడించింది. దాని ప్రకారం, 2022 లో హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, చంఢీఘర్, గాంధీనగర్, గురుగ్రామ్, జామ్ నగర్, కోల్‌కతా, చెన్నై, లక్నో, పూణె, ఢిల్లీ, ముంబై నగరాలకు 5జీ సేవలు అందనున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, టెలీకామ్, ఆటోమొబైల్, టెక్నాలజీ, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.














