హైలైట్స్:
- బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Moto e32 ని లాంచ్ చేసిన మోటోరోలా
- Moto e32 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.10,499
- ఐపీ52 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తున్న Moto e32 స్మార్ట్ ఫోన్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ Motorola కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ Moto e32 ని లాంచ్ చేసింది. Moto e32 50 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తోంది. ఈ ఫోన్లో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, ఐపీ52 వాటర్ రెసిస్టన్స్ రేటింగ్ కూడా ఉన్నాయి. మోటోరోలా రీసెంట్ గా భారత్ లో Moto G72 స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. మీడియాటెక్ హీలియో జీ99 చిప్సెట్ తో వచ్చిన తొలి ఫోన్ Moto G72. ఇప్పుడు Moto e32 గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Moto e32 ధర, లభ్యత, బ్యాంక్ ఆఫర్లు
Moto e32 స్మార్ట్ ఫోన్ ధర భారత్ లో రూ.10,499 గా ఉంది. ఫ్లిప్ కార్ట్, రిటైల్ స్టోర్స్ ద్వారా నేటి నుంచి ఈ ఫోన్ సేల్ కి వచ్చింది. ఇకో బ్లాక్, ఆర్కిటిక్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో Moto e32 లభిస్తుంది. ఇంట్రడక్టరీ ఆఫర్ క్రింద, రూ.2549 విలువ గల రిలయన్స్ జియో బెనిఫిట్స్ ని మోటోరోలా అందిస్తోంది. అలాగే Moto e32 కొనుగోలు పై రూ.2000 క్యాష్ బ్యాక్, జీ5 యాన్యువల్ మెంబర్షిప్ పై రూ.549 డిస్కౌంట్ కూడా లభించనుంది.
Moto e32 స్పెసిఫికేషన్స్
Moto e32 లో 6.5-ఇంచ్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ లో మీడియాటెక్ హీలియో జీ37 చిప్సెట్ అమర్చారు. ఈ ఫోన్ 4జిబి ర్యామ్ + 64జిబి స్టోరేజీ తో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. Moto e32 లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 10 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Moto e32 కెమెరా విభాగం ఎలా ఉందో చూద్దాం. Moto e32 లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు వైపున 8 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.
Moto e32 లో 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వర్షన్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ కలిగి ఉంది. ఫోన్ భద్రత కోసం ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అందించారు.
సెన్సర్స్ విషయానికి వస్తే, ఇందులో ప్రాక్సిమిటీ సెన్సర్, ఆంబియంట్ లైట్ సెన్సర్, యాక్సెలరోమీటర్, నోటిఫికేషన్ ఎల్ఈడీ వంటివి ఉన్నాయి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు వెబ్ సైట్ విజిట్ చేయండి.












