దీపావళి రోజున లాంచ్ అవుతోన్న బడ్జెట్ ఫ్రెండ్లీ Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్

హైలైట్స్:

  • దీపావళి రోజున కొత్త చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంచ్ చేస్తున్న ఓలా ఎలక్ట్రిక్
  • రీసెంట్ గా ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేసిన Ola సీఈవో భవీశ్ అగర్వాల్
  • సెప్టెంబర్ లో 9,634 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మిన ఓలా కంపెనీ

భారతదేశంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మే కంపెనీల్లో Ola Electric కూడా ఒకటి. ఈ కంపెనీ ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో ఒక ఈ-స్కూటర్ ని తీసుకొస్తొంది. ఓలా సీఈవో భవీశ్ చేసిన ట్వీట్ ని బట్టి ఈ బడ్జెట్ స్కూటర్ దీపావళి పండుగ రోజున లాంచ్ అవ్వనుందని తెలుస్తోంది.

ఈ నెలలోనే న్యూ వెహికిల్ లాంచ్ కానుందని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ట్వీట్ ద్వారా తెలుస్తోంది. “ఈ నెలలో సంథింగ్ బిగ్ ప్లాన్ చేస్తున్నాం. #EndICEAge రెవొల్యూషన్ ని కనీసం 2 ఏళ్ళు యాక్సలరేట్ చేయనుంది. నిజంగా ఎగ్జైటింగ్ గా ఉంది,” అంటూ భవీశ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఓలా ఎస్1 వెహికిల్స్ లో కెల్లా అత్యంత చౌకైన స్కూటర్ ని ఓలా ఎలక్ట్రిక్ లాంచ్ చేయబోతున్నట్లు కార్ అండ్ బైక్ ఓ కథనాన్ని వెలువరించింది.

కార్ అండ్ బైక్ రిపోర్ట్ లో పేర్కొన్న దాని ప్రకారం, సరికొత్త, చౌకైన Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.80,000 లోపు ఉండనుందని సమాచారం. అంటే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పెట్రోల్ స్కూటర్ల ధరలోనే ఈ స్కూటర్ వస్తుందన్న మాట. ఓలా ఎస్1, ఎస్1 ప్రో స్కూటర్లలో ఉన్న దాదాపు అన్ని ఫీచర్లను ఈ బడ్జెట్ స్కూటర్లో కూడా అందిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ చెబుతోంది. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ యొక్క MoveOS ప్లాట్ఫామ్ పై పని చేస్తుంది.

ఆగస్టులో ఓలా కంపెనీ Ola S1 స్కూటర్ ని లాంచ్ చేసింది. ఓలా ఎస్1 ప్రో కంటే దీని ధర తక్కువ. ఓలా ఎస్1 ఎక్స్-షోరూమ్ ధర రూ.99,999 గా కంపెనీ నిర్ణయించింది. ఇది 5.5 కిలో వాట్ మోటర్, 8.5 కిలో వాట్ పీక్ పవర్ ని కలిగి ఉంది. ఇది 141 కిలోమీటర్ల రేంజ్ తో వచ్చింది. అలాగే 95 కేఎంపీహెచ్ అత్యధిక స్పీడ్ ని కలిగి ఉంది. హోమ్ చార్జర్ తో ఓలా ఎస్1 స్కూటర్ 5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది.

Ola S1 స్కూటర్ లో 3 కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఓలా యొక్క మూవ్ ఓఎస్ ప్లాట్ఫామ్ పై ఈ స్కూటర్ పని చేస్తుంది. మ్యూజిక్ ప్లే బ్యాక్ ఫీచర్, నేవిగేషన్, కంపానియన్ యాప్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఈ బండి లో ఉన్నాయి. దీపావళి వరకు మూవ్ ఓఎస్ 3.0 అప్డేట్ ని ఓలా తీసుకురానుంది.

ఇటీవలె నవరాత్రి పర్వదినాల్లో తమ కంపెనీ విజయవంతంగా ప్రతి నిమిషం ఎలక్ట్రిక్ స్కూటర్ ని అమ్మినట్లు సదరు కంపెనీ తెలిపింది. పండుగ సీజన్ లో తమ అమ్మకాలు నాలుగు రెట్లు పెరిగాయని కంపెనీ చెప్పింది. దేశ వ్యాప్తంగా 1 లక్ష కస్టమర్ టెస్ట్ డ్రైవ్స్ ఆర్గనైజ్ చేసామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. సెప్టెంబర్ లో ఓలా సంస్థ 9364 యూనిట్లను అమ్మింది. వాహన్ నంబర్స్ ద్వారా ఈ విషయం స్పష్టమైంది.

వాహనాల అమ్మకాలు బాగానే ఉన్నప్పటికీ, ఓలా ఎలక్ట్రిక్ కి మాత్రం సమస్యలు లేకపోలేదు. ఇటీవలి కాలంలో ఓలా ఈ-స్కూటర్లపై ఫిర్యాదులు ఎక్కువయ్యాయి. ఓలా ఎస్1 ప్రో లో సాఫ్ట్ వేర్ సమస్యల వల్లన 90 కిలోమీటర్ల వేగంతో బండి రివర్స్ వెళ్ళడం భయం కలిగించే విషయం. అలాగే అడపాదడపా మంటలు చెలరేగడం వంటి ఉదంతాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. త్వరలోనే అన్ని సమస్యలకు ఓలా ఎలక్ట్రిక్ చెక్ పెడుతుందని ఆశిద్దాం.

Previous article90Hz డిస్ప్లే, 50MP డ్యూయల్ కెమెరాతో భారత్ లో లాంచ్ అయిన Moto e32
Next articleసూపర్ డీల్: రూ.60,000 లోపు ధరలో Samsung Galaxy Z Flip 3
Shivakishore Bandi
ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ మీడియాలో సుదీర్ఘ అనుభవం కలిగిన శివకిశోర్ బండి, ప్రస్తుతం 91మొబైల్స్‌లో స్మార్ట్‌ఫోన్ మరియు ఇతర గ్యాడ్జెట్స్ వార్తలను పాఠకులకు సులభతరమైన వాడుక భాషలో అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన శాతావాహన విశ్వవిద్యాలయం నుంచి ఎమ్ఏ.ఇంగ్లీషు పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రాయగల నైపుణ్యం ఈయన సొంతం. కంటెంట్ క్రియేటర్‌గా, రైటర్‌గా, సబ్-ఎడిటర్‌గా, మరియు ట్రాన్స్‌లేటర్‌గా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. వన్-లైనర్స్ మరియు కోట్స్ రాయడంలో కూడా శివకిశోర్‌కి ప్రావీణ్యం కలదు.