హైలైట్స్
- భారత్ లో లాంచ్ అయిన మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్
- ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఒకే ఒక వేరియంట్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ
- తాజాగా 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ వేరియంట్ లాంచ్ తో 30 అల్ట్రా లైనప్ లో చేరిన మరొక హ్యాండ్సెట్
సెప్టెంబర్ నెలలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీదారు మోటోరోలా తన ఫ్లాగ్షిప్ డివైజ్ Motorola Edge 30 Ultra ని భారత్ లో లాంచ్ చేసింది. అప్పుడు కేవలం 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ మాత్రమే మార్కెట్ లోకి వచ్చింది. అయితే 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మోడల్ ఎప్పుడు వస్తుందా అని మోటో లవర్స్ ఎదురు చూశారు. తాజాగా మోటోరోలా కంపెనీ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ని భారత మార్కెట్ లో లాంచ్ చేసింది.
200ఎంపి మెయిన్ కెమెరాతో వచ్చిన భారతదేశపు తొలి ఫోన్ గా Motorola Edge 30 Ultra పరిగణించబడుతోంది. దీంతో పాటు ఈ ఫోన్లో 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 144 హెర్ట్జ్ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 50ఎంపి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, టెలీఫోటో లెన్స్, 60ఎంపి సెల్ఫీ కెమెరా వంటి ప్రధాన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మరి లేటెస్ట్ వేరియంట్ ధర, ఆఫర్ల గురించి తెలుసుకుందాం పదండి.
భారత్ లో Motorola Edge 30 Ultra 12GB వేరియంట్ ధర, లభ్యత
Motorola Edge 30 Ultra 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.54,999 గా నిర్ణయించారు. ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్, స్టార్‌లైట్ వైట్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. ఇక ఆఫర్ల విషయానికి వస్తే, కొనుగోలుదారులు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పై 10 శాతం డిస్కౌంట్, అంటే రూ.3000 వరకు అన్ని ఆఫర్లు కలుపుకుని ప్రయోజనం పొందవచ్చు.
Motorola Edge 30 Ultra స్పెసిఫికేషన్స్
Motorola Edge 30 Ultra లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ పీఓఎల్ఈడీ డిస్ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఈ ఫోన్ కర్వ్డ్ డిస్ప్లే ని కలిగి ఉంది. హెచ్డీఆర్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది. ఇకపోతే ఈ డివైజ్ లో స్నాప్ డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ ని కలిగి ఉంది. 12జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి.
ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Motorola Edge 30 Ultra లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో ఓఐఎస్ తో కూడిన 200ఎంపి శాంసంగ్ హెచ్‌పీ1 మెయిన్ కెమెరా ఉంది. అలాగే 50ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 12ఎంపి టెలీఫోటో 2x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో ముందు వైపున 60ఎంపి కెమెరా అందించారు. Motorola Edge 30 Ultra 8కే, 4కే హెచ్డీఆర్10+ వీడియో రికార్డింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
Motorola Edge 30 Ultra లో 4610ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 125 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. అలాగే 50 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 198.5 గ్రాములు కాగా, మందం 8.39 మిల్లీ మీటర్లు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. రెండు మేజర్ ఓఎస్ అప్డేట్స్ ని కంపెనీ హామీ ఇస్తోంది.
Motorola Edge 30 Ultra లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ని అందించారు. ఇంకా ఈ ఫోన్ లో స్టీరియో స్పీకర్స్ ని అందించారు. ఎన్ఎఫ్‌సీ, వైఫై 6ఈ, బ్లూటూత్ 5.2 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ ఫోన్ ఐపీ52 రేటింగ్ తో వస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












