హైలైట్స్
- చైనా మార్కెట్ లో లాంచ్ అయిన Huawei Pocket S ఫోల్డబుల్ ఫోన్
- 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2790*1188 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1.04-ఇంచ్ సెకండరీ డిస్ప్లే ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
- Huawei Pocket S ధర RMB 5988 (సుమారు రూ.68,000)

ఫోల్డబుల్ ఫోన్స్ విషయానికి వస్తే, అందరి నోటి వెంట వచ్చే మొదటి పేరు శాంసంగ్. తన గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ స్మార్ట్ ఫోన్స్ తో శాంసంగ్ కంపెనీ ఫ్లాగ్షిప్ సెగ్మెంట్ లో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఫోన్స్ చూడటానికి చాలా బాగుంటాయి. కానీ, కొనాలంటే అందరికీ సాధ్యం కాదు. వీటి ధరలు ఆకాశంలో ఉంటాయి మరి. అయితే ఇప్పుడు శాంసంగ్ మార్కెట్ ని చాలెంజ్ చేయడానికి హువావే కంపెనీ ఓ Huawei Pocket S అనే చవకైన ఫోల్డబుల్ ఫోన్ తో వచ్చింది. Huawei Pocket S ధర రూ.60,000 ప్రైస్ బ్రాకెట్ లో ఉండటంతో జనాలకు దీనిపై ఆసక్తి కలిగి అవకాశాలున్నాయి.
మరి ఈ ఫోన్ భారత మార్కెట్ కి వస్తుందో లేదో ఇంకా తెలియదు. ప్రస్తుతానికి హువావే తాత్కాలికంగా భారత్ లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. భవిష్యత్తులో మళ్ళీ వస్తామని కూడా చెప్పింది. అది ఎప్పుడన్నది ఇంకా తెలియదు. ఇప్పుడు Huawei Pocket S యొక్క స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.
Huawei Pocket S డిస్ప్లే
Huawei Pocket S స్మార్ట్ ఫోన్ 6.9-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 2790*1188 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఈ ఫోన్ బ్యాక్ ప్యానెల్ పై 1.04-ఇంచ్ సెకండరీ డిస్ప్లే కలిగి ఉంది.
Huawei Pocket S డిజైన్
Huawei Pocket S డిజైన్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ కచ్చితంగా శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్స్ కి పోటీ ఇస్తుందని చెప్పాలి. లుక్ మరియు డిజైన్ పరంగా ఈ ఫోన్ సూపర్బ్ గా ఉంది. Huawei Pocket S ఫోల్డబుల్ ఫోన్ మింట్ గ్రీన్, గోల్డ్ యెల్లో, రోస్ పింక్, ఐస్ క్రిస్టల్ బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Huawei Pocket S ప్రాసెసర్
Huawei Pocket S స్మార్ట్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి ప్రాసెసర్ ని వాడారు. ఈ ఫోన్ హార్మని ఓఎస్ 3 పై పని చేస్తుంది. Huawei Pocket S స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్, 512 జిబి వరకు స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.
Huawei Pocket S కెమెరా
Huawei Pocket S ఫోన్ యొక్క కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Huawei Pocket S ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 40 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. Huawei Pocket S లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.7 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
Huawei Pocket S బ్యాటరీ
పవర్ బ్యాకప్ కోసం Huawei Pocket S ఫోల్డబుల్ ఫోన్ లో 4000 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఇది 40 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. అంటే చాలా తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది.
Huawei Pocket S ధర
Huawei Pocket S మొత్తం మూడు స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అయ్యింది. అవి: 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. 128జిబి వేరియంట్ ధర RMB 5988 (సుమారు రూ.68,000), 256జిబి వేరియంట్ ధర RMB 6488 (సుమారు రూ.73,700), 512జిబి యూనిట్ ధర RMB 7488 (సుమారు రూ.85,000).
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












