హైలైట్స్
- గీక్ బెంచ్ పై కనిపించిన Samsung Galaxy S23+ యూఎస్ వేరియంట్
- లిస్టింగ్ ద్వారా రివీల్ అయిన స్పెసిఫికేషన్స్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్, 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్ తో వస్తోన్న Samsung Galaxy S23+
- సింగిల్ కోర్ టెస్ట్ లో 1485 పాయింట్స్, మల్టీ-కోర్ టెస్ట్ లో 4844 పాయింట్స్ నమోదు చేసిన Samsung Galaxy S23+

గత కొన్ని రోజులుగా శాంసంగ్ తదుపరి ఫ్లాగ్షిప్ లైనప్ అయిన S-సిరీస్ గురించి చాలా వార్తలు వింటున్నాం. ఈ వారం, Samsung Galaxy S23+ యూఎస్ వేరియంట్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ Geekbench పై కనిపించింది. ఈ ఫోన్ SM-S916U అనే మోడల్ నంబర్ ని కలిగి ఉంది. ఈ లిస్టింగ్ ద్వారా ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. Samsung Galaxy S23 సిరీస్ 2023 ఆరంభంలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లైనప్ లో మొత్తం 3 మోడల్స్ ఉంటాయి. అవి: Samsung Galaxy S23, Samsung Galaxy S23+, Samsung Galaxy S23 Ultra.
గీక్ బెంచ్ పై Samsung Galaxy S23+ సింగిల్ కోర్ టెస్టులో 1485 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్టులో 4844 పాయింట్లు నమోదు చేసింది. గీక్ బెంచ్ లిస్టింగ్ ద్వారా Samsung Galaxy S23+ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ తో వస్తున్నట్లు స్పష్టమైంది. ఈ చిప్సెట్ ీ నెలలో జరగబోవు క్వాల్కమ్ సమ్మిట్ లో లాంచ్ కానుంది.
Samsung Galaxy S23+ గీక్‌బెంచ్ లిస్టింగ్

తొలుత Samsung Galaxy S23+ ని గీక్‌బెంచ్ పై MySmartPrice వెబ్ సైట్ గుర్తించింది. Samsung Galaxy S23+ ఆండ్రాయిడ్ 13 ఓఎస్, 8జిబి ర్యామ్ తో వస్తున్నట్లు సమాచారం. అయితే ఇతర ర్యామ్ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తోందని అంచనా వేస్తున్నారు.
ఈ చిప్ లోని ప్రైమరీ కోర్ 3.36 గిగాహెర్ట్జ్, మరో నాలుగు కోర్స్ 2.80 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 740 జీపీయూ ని వినియోగించారు. ఇప్పటికి గీక్ బెంచ్ ద్వారా Samsung Galaxy S23+ గురించి తెలిసిన విషయాలు ఇవేనండి.
Samsung Galaxy S23+ స్పెసిఫికేషన్స్ (అంచనా)
Samsung Galaxy S23+ 6.6-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ లేదా ఎగ్జినోస్ 2300 చిప్సెట్ వంటి స్పెసిఫికేషన్స్ తో రానుంది. ప్రాంతాన్ని బట్టి స్నాప్ డ్రాగన్ లేదా ఎగ్జినోస్ చిప్సెట్ ఉంటుంది. ఇప్పుడు కెమెరా విభాగం గురించి తెలుసుకుందాం. Samsung Galaxy S23+ లో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగా పిక్సెల్ టెలీఫోటో లెన్స్ లతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా Samsung Galaxy S23+ లో ఉండే అవకాశం ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











