రూ.9,999 లాంచ్ ఆఫర్ తో సేల్ కి వస్తోన్న Lava Blaze 5G

హైలైట్స్

  • భారత్ లో లాంచ్ అయిన అత్యంత చవకైన 5జీ స్మార్ట్ ఫోన్
  • అమెజాన్ ద్వారా అన్‌వీల్ అయిన Lava Blaze 5G, త్వరలోనే మొదలుకానున్న సేల్
  • 50ఎంపి కెమెరా, 7జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన Lava Blaze 5G, ధర రూ.9,999

భారత్ లో ఇటీవలె 5జీ సేవలు లాంచ్ అయ్యాయి. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు 5జీ నెట్వర్క్ ని విస్తరింపజేసేందుకు టెలీకామ్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోవైపు మొబైల్ ఫోన్ తయారీ సంస్థలు వరుసగా 5జీ హ్యాండ్సెట్స్ ని మార్కెట్ లోకి వదులుతున్నాయి. అయితే వీటి ప్రారంభ ధర దాదాపు రూ.15,000 నుంచి మొదలవుతోంది. దీంతో అంత మొత్తం వెచ్చించలేని వినియోగదారులు అత్యంత చవకైన 5జీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో భారతీయ కంపెనీ లావా తన Lava Blaze 5G అనే స్మార్ట్ ఫోన్ తో రంగంలోకి దిగింది. ఇప్పటి వరకు ఉన్న అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే కావడం విశేషం.

అమెజాన్ ద్వారా ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. నేడే ఈ ఫోన్ అమెజాన్ ద్వారా అన్‌వీల్ అయ్యింది. సేల్ తేదీని ఇంకా లావా కంపెనీ ప్రకటించలేదు. మరి Lava Blaze 5G యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Lava Blaze 5G ధర

భారత్ లో Lava Blaze 5G లాంచ్ అయ్యింది. రూ.9,999 ధరతో భారత్ లో ఈ ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియా ఈ-కామర్స్ సైట్ ద్వారా ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. Lava Blaze 5G 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో మాత్రమే లాంచ్ అయ్యింది.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ని ప్రత్యేక ఆఫర్ లో రూ.9,999 కే కొనుగోలు చేయవచ్చు. ప్రారంభ సేల్ లోనే ఈ ధర వర్తిస్తుంది. తర్వాత ఈ ధర ఉండకపోవచ్చు. అందుకే ఆసక్తిగల వారు వెంటనే నోటిఫై చేసుకుని ఫోన్ ని కొనేందుకు సిద్ధమవ్వండి. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Lava Blaze 5G స్పెసిఫికేషన్స్

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ 6.5-ఇంచ్ హెచ్డీ+ డిస్ప్లే, ఐపీఎస్ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ డిస్ప్లే వైడ్‌వైన్ ఎల్1 సపోర్ట్ తో వస్తోంది. దీని ద్వారా ఓటీటీ మరియు ఇతర వీడియో కంటెంట్ ని హెచ్డీ క్వాలిటీలో చూడవచ్చు.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పని చేస్తుంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ వాడారు. ఇది 7 నానోమీటర్ ఫాబ్రికేషన్ పై తయారైన చిప్సెట్. ఈ ఆక్టాకోర్ ప్రాసెసర్ 2.2 గిగాహెర్ట్జ్ క్లాక్ స్పీడ్ ని కలిగి ఉంది.

Lava Blaze 5G స్మార్ట్ ఫోన్ లో 4జిబి ఆన్‌బోర్డ్ ర్యామ్ తో పాటు 3జిబి వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీని ద్వారా మొత్తం 7జిబి ర్యామ్ ని పొందవచ్చు. ఇకపోతే 128జిబి ఇంటర్నల్ స్టోరేజీని ఈ ఫోన్ లో అందించారు. మైక్రోఎస్డీ కార్డ్ ద్వారా మెమొరీని 1టిబి వరకు పెంచుకునే వీలుంది.

ఇప్పుడు Lava Blaze 5G యొక్క కెమెరా విభాగం ఎలా ఉందో తెలుసుకుందాం. Lava Blaze 5G లో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

Lava Blaze 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంది. ఇది పవర్ బటన్ లో నిక్షిప్తమై ఉంటుంది. Lava Blaze 5G లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.