హైలైట్స్
- భారత్ లో ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ని తీసుకొచ్చిన అమెజాన్
- మొబైల్ ప్యాక్ ద్వారా అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, జాతీయ, అంతర్జాతీయ చిత్రాలు పొందనున్న యూజర్లు
- తన సరికొత్త మొబైల్ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వనున్న అమెజాన్

అమెజాన్ కంపెనీ తన ప్రైమ్ వీడియో మెంబర్షిప్ కోసం భారత్ లో కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ని లాంచ్ చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ని కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఒక నెల, 3 నెలలు, 12 నెలల కాలపరిమితితో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ తన కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ ద్వారా డిస్నీ+ హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ లకు గట్టి పోటీ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది.
అసలు విషయం ఏంటంటే, డిస్నీ+ హాట్స్టార్ మొబైల్ ప్లాన్ ఎన్నో టెలీకామ్ రీచార్జ్ ప్లాన్స్ తో బండిల్ చేయబడి వస్తోంది. ఇప్పుడు ఈ షేర్ ని కొంత మొత్తం కబ్జా చేసేందుకు అమెజాన్ మొబైల్-ఓన్లీ ప్లాన్ సబ్స్క్రిప్షన్ ధరను తక్కువ ధరకే తీసుకువచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇతర వివరాల గురించి తెలుసుకుందాం. పదండి.
Amazon Prime Video మొబైల్ ఎడిషన్ విశేషాలు
Amazon ఏడాదికి రూ.599 ధరతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. స్టాండర్డ్ యాన్యువల్ ప్యాక్ ధర రూ.1,499 గా ఉంది. అయితే మొబైల్-ఓన్లీ ప్లాన్ చాలా తక్కువ ధరకు లభించనుంది. ఈ మొబైల్ ప్లాన్ ద్వారా 480p స్టాండర్డ్ రెజుల్యూషన్ తో వీడియోను చూసే అవకాశం ఉంటుంది. స్టాండర్డ్ ప్యాక్ అయితే 4కే స్ట్రీమింగ్ ఆప్షన్ ఉంటుంది.
మొబైల్ ప్యాక్ ద్వారా అమెజాన్ ఒరిజినల్స్, లైవ్ క్రికెట్, భారతీయ, అంతర్జాతీయ సినిమాలకు యాక్సెస్ లభిస్తుంది. వీటితో పాటు, ఆఫ్ లైన్ లో చూడటానికి డౌన్ లోడ్ ఆప్షన్, ఐఎండీబీ యొక్క ఎక్స్-రే వంటి ఫీచర్లు లభిస్తాయి.
అయితే మొబైల్ ఎడిషన్ ప్యాక్ కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో రావడం లేదు. ఫ్రీ-ఫాస్ట్ అమెజాన్ డెలివరీ, యాడ్-ఫ్రీ మ్యూజిక్ (ప్రైమ్ మ్యూజిక్), ప్రైమ్ రీడింగ్ వంటి ఫీచర్లు రాబోవు. ఈ ఫీచర్లు కేవలం రూ.1499 ప్లాన్ కి మాత్రమే పరిమితం. టాప్-టైర్ ప్లాన్ ద్వారా మల్టీ-యూజర్ ప్రొఫైల్స్, వివిధ డివైజెస్ పై స్ట్రీమింగ్ వంటివి లభిస్తాయి. మొబైల్-ఓన్లీ ప్లాన్ యూజర్లు కేవలం ఒకే అకౌంట్ ద్వారా కంటెంట్ ని వినియోగించుకునే వీలుంది.
Amazon Prime India వైస్ ప్రెసిడెంట్ గౌరవ్ గాంధీ ఈ కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ ని లాంచ్ చేశారు. 99 శాతం పిన్కోడ్స్ నుంచి ప్రైమ్ వీడియో కి వ్యూయర్షిప్ వస్తోందని గాంధీ తెలిపారు.
అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్ కి భారత మార్కెట్ ఎంతో కీలకమైనదని ప్రైమ్ వీడియో, ఇంటర్నేషనల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ కెల్లీ డే అన్నారు. కొత్త మొబైల్-ఓన్లీ ప్లాన్ తో తమకు యూజర్లు గణనీయంగా పెరుగుతారని అమెజాన్ ఆశిస్తోంది. మరింకెందుకు ఆలస్యం ఓటీటీ కంటెంట్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే వెంటనే ప్రైమ్ వీడియో మొబైల్-ఓన్లీ ప్లాన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











