ఇవాళ రాత్రి 12 గంటల నుంచి OTT లో స్ట్రీమ్ కానున్న Ori Devuda

హైలైట్స్

  • ఓరి దేవుడా చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ఆహా
  • ఈరోజు రాత్రి 12 గంటల నుంచి ప్రసారం కానున్న ఓరి దేవుడా సినిమా
  • ఓరి దేవుడా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్, ఆశా భట్

యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఇటీవలె ‘ఓరి దేవుడా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్స్ లో చిత్రబృందం సినిమా విజయం పై ధీమాగా కనిపించింది. మరీ ముఖ్యంగా విశ్వక్ సేన్ హిట్టు పక్కా అనుకున్నాడు. కానీ, ఆశించిన రేంజ్ లో ఫలితం రాలేదు.

సినిమా బాగున్నప్పటికీ ఇతర సినిమాల నుంచి పోటీ ఎక్కువగా ఉండటం వల్లన ఓరి దేవుడా కి జనాల తాకిడి లేకుండా పోయింది. విశ్వక్ సేన్ నటన జనాలకు బాగా నచ్చింది. స్టోరీలైన్ కూడా పర్వాలేదనిపించింది. అయితే సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసులను కురిపించలేకపోయింది.

పీవీపీ నిర్మాణంలో తెరకెక్కిన ‘ఓరి దేవుడా’ చిత్రం తమిళ హిట్ మూవీ ‘ఓ మై కడవులె’ చిత్రానికి రీమేక్. స్టోరీలైన్ కి మంచి మార్కులు పడ్డాయి. అక్కడక్కడా కామెడీ పేలింది. ఇక ప్రత్యేక పాత్రలో వెంకటేశ్ కనిపించి సందడి చేశారు. అయినప్పటికీ సినిమా మాత్రం అనుకున్న విజయం సాధించలేదు. దీంతో ఇప్పుడు చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

‘ఓరి దేవుడా’ సినిమా నేటి రాత్రి నుంచి ఓటీటీ లో ప్రసారమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఓటీటీ ప్లాట్ఫామ్ లో విజయం సాధించేందుకు కావాల్సిన అన్ని అంశాలు ఈ చిత్రానికి మెండుగా ఉన్నాయి. సరదాగా సాగే రొమాంటిక్ కామెడీ జోనర్ లను ఇష్టపడే ప్రేక్షకులకు ఓరి దేవుడా వినోదాన్ని పంచడం ఖాయం. మిథిలా పాల్కర్, ఆశా భట్ లతో కలిసి విశ్వక్ చేసిన సందడిని చూసి ఎంజాయ్ చేయండి.

చిత్ర కథ

‘ఓరి దేవుడా’ చిత్ర కథ ఇద్దరు కపుల్ చుట్టూ తిరుగుతుంది. అర్జున్ పాత్రలో విశ్వక్ కనిపిస్తాడు. అర్జున్ తన చిన్ననాటి స్నేహితురాలుని వివాహం చేసుకుంటాడు. అయితే పెళ్ళి తర్వాత జీవితం పట్ల ఆసక్తిని కోల్పోతాడు. అతడికి ఆ అమ్మాయి పట్ల లవ్ ఫీలింగ్స్ కలగడపోవడమే అందుకు కారణం. దీంతో ఇద్దరు డివోర్స్ కి సిద్ధమవుతారు. మరి వారి నిర్ణయం సరైనదేనా? వారి వివాహ బంధానికి ఏమైందనేది మిగతా కథ.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమాస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఎలన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. తరుణ్ భాస్కర్ సంభాషణలు రాశాడు.

తమిళంలో ఓ మై కడవులె చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహించాడు. విక్టరీ వెంకటేశ్ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించారు. విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ ప్రధాన పాత్రలు పోషించారు.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.