హైలైట్స్
- త్వరలో చైనాలో లాంచ్ అవుతోన్న Vivo X90 సిరీస్
- ఈ లైనప్ లో రానున్న Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ మోడల్స్
- లాంచ్ కి ముందు లీకైన Vivo X90 సిరీస్ స్టోరేజీ ఆప్షన్స్, కలర్స్, రెండర్స్

Vivo త్వరలోనే చైనాలో Vivo X90 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ ని లాంచ్ చేయబోతోంది. ఈ లైనప్ నవంబర్ 22 న ఎంట్రీ ఇవ్వనుంది. దీని తర్వాత గ్లోబల్ లాంచ్ ఉంటుంది. లాంచ్ కి ముందు Vivo X90, Vivo X90 Pro, Vivo X90 Pro+ స్మార్ట్ ఫోన్స్ యొక్క ఇమేజెస్, మెమొరీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ లీక్ అయ్యాయి. కొన్ని రోజుల క్రితమే Vivo X90 Pro+ గీక్ బెంచ్ పై కనిపించడంతో ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ బయటకు వచ్చాయి. తాజా లీక్ తో మరిన్ని విషయాలు తెలిసాయి. ఓసారి అవేంటో తెలుసుకుందాం పదండి.
Vivo X90 రెండర్స్, స్టోరేజీ ఆప్షన్స్
Vivo X90 లైనప్ యొక్క మెమొరీ వేరియంట్స్, కలర్ ఆప్షన్స్ ని ఎక్స్క్లూజివ్ గా Pricebaba లీక్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం, స్టాండర్డ్ మోడల్ Vivo X90 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి/512జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభించనుంది. ఈ డివైజ్ బ్లాక్, ఐస్ బ్లూ, రెడ్ కలర్ ఆప్షన్స్ లో దొరుకుతుంది.
ఇక Vivo X90 Pro విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు మెమొరీ వేరియంట్స్ లో లభించనుంది. అవి: 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ. ఈ డివైజ్ బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ కానుందని సమాచారం.
చివరగా, Vivo X90 Pro+ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ, 12జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ డివైజ్ బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
Vivo X90 Pro+ స్పెసిఫికేషన్స్ (అంచనా)
Vivo X90 Pro+ 6.78-ఇంచ్ ఈ6 అమోలెడ్ ఎల్టీపీవో డిస్ప్లే, క్వాడ్ హెచ్డీ+ రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 చిప్సెట్ ని ఈ ఫోన్ లో వాడినట్లు సమాచారం. కెమెరా విషయానికి వస్తే, Vivo X90 Pro+ లో ఓఐఎస్ కలిగిన 50ఎంపి 1-ఇంచ్ సోని ఐఎంఎక్స్989 సెన్సర్, 48ఎంపి సోని ఐఎంఎక్స్598 అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపి సోని ఐఎంఎక్స్578 పొట్రెయిట్ కెమెరా (ఓఐఎస్), 64ఎంపి ఒమ్నివిజన్ ఏవీ64ఏ పెరిస్కోప్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఇక బ్యాటరీ విభాగం చూస్తే, Vivo X90 Pro+ లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ మరియు 50 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. Vivo X90 Pro+ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











