హైలైట్స్
- పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తోన్న Samsung Galaxy A54 5G
- వైట్ కలర్ ఆప్షన్ లో లభించనున్న Samsung Galaxy A54 5G, ఇతర కలర్ ఆప్షన్స్ కూడా ఉండే అవకాశం
- 2023 ఆరంభంలో లాంచ్ కానున్న Samsung Galaxy A54 5G

Samsung Galaxy A54 5G కి సంబంధించిన 5కే రెండర్స్, మరియు 360-డిగ్రీ వీడియోని ప్రముఖ లీక్‌స్టర్ ఆన్‌లీక్స్ సౌజన్యంతో మీ ముందుకు తీసుకొచ్చాం. Samsung Galaxy A53 కి సక్సెసర్ గా Samsung Galaxy A54 5G మార్కెట్ లోకి వస్తోంది. Samsung Galaxy A54 5G డిజైన్ గత మోడల్ మాదిరిగానే ఉందనిపిస్తోంది. సెంటర్ పంచ్ హోల్ కటౌట్, మందపాటి బెజెల్స్, ట్రిపుల్ కెమెరాలు ఈ ఫోన్ లో కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో రానుంది. టిప్‌స్టర్ OnLeaks ఫోన్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు.
2023 ఆరంభంలో Samsung Galaxy A54 5G లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్ లో కూడా ఈ ఫోన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఏ-సిరీస్ ఫోన్లకు జనాల్లో మంచి డిమాంగ్ ఉన్న సంగతి తెలిసిందే. శాంసంగ్ లవర్స్ ఏ53 సక్సెసర్ అయిన Samsung Galaxy A54 5G కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Samsung Galaxy A54 5G డిజైన్
Samsung Galaxy A54 5G స్మార్ట్ ఫోన్ లో సెంటర్ పొజిషన్డ్ పంచ్ హోల్ కటౌట్, లావైన బెజెల్స్ ఉన్నాయి. కుడివైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఉన్నాయి. యూఎస్బీ టైప్ సీ పోర్ట్, మైక్రోఫోన్, స్పీకర్ గ్రిల్ బాటమ్ లో ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ ట్రే, సెకండరీ మైక్రోఫోన్ టాప్ లో ఉన్నాయి. బ్యాక్ ప్యానెల్ పై ట్రిపుల్ కెమెరా సెటప్, ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. రియర్ ప్యానెల్ పైన శాంసంగ్ లోగో ఉంది.
Samsung Galaxy A54 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)
OnLeaks బయటపెట్టిన సమాచారాన్ని బట్టి, Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 6.4-ఇంచ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చే అవకాశం ఉంది. ఈ డివైజ్ ట్రిపుల్ కెమెరాస్ తో వస్తోంది. అయితే సెన్సర్స్ కి సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు. Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 158.3 మిల్లీ మీటర్ల పొడవు, 76.7 మిల్లీ మీటర్ల వెడల్పు, 8.2 మిల్లీ మీటర్ల మందం ఉండనుంది. అయితే ఇతర స్పెసిఫికేషన్స్ వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
అయితే గతంలో లీకైన సమాచారం ప్రకారం, Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ 4,905 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలిసింది. అయితే దీన్ని 5000 ఎంఏహెచ్ బ్యాటరీగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇక ట్రిపుల్ రియర్ కెమెరా లేఅవుట్ లో 50ఎంపి ప్రైమరీ సెన్సర్ ఉండనుంది. ఈసారి డెడికేటెడ్ డెప్త్ సెన్సర్ ని స్కిప్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపై దాని పని మెయిన్ సెన్సరే చేయనుంది.
Samsung Galaxy A54 స్మార్ట్ ఫోన్ ఎగ్జినోస్ 7904 ప్రాసెసర్, 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో రానుందని తెలుస్తోంది. అయితే ఇప్పటికి ఏ వివరాలు కన్ఫర్మ్ కాలేదు. త్వరలోనే స్పెసిఫికేషన్స్ పై స్పష్టత రానుంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.











