హైలైట్స్
- Jio 4జీ ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేక రీచార్జ్ ప్లాన్ అందిస్తోన్న జియో
- రూ.75 లతో మొదలై రూ.899 వరకు ఉన్న రీచార్జ్ ప్లాన్స్
- ప్రత్యేకంగా డేటా ప్లాన్స్ ని కూడా అందిస్తోన్న జియో
మీరు గనుక జియో 4జీ ఫీచర్ ఫోన్ (జియో ఫోన్/జియో ఫోన్ 2) వాడే కస్టమర్ అయితే ఈ కథనం మీకు ఉపయోగపడుతుంది. జియో ఫోన్ వాడుతున్న వారికి అందుబాటులో ఉన్న రీచార్జ్ ప్లాన్స్ వివరాలను ఇక్కడ మీకోసం అందిస్తున్నాం. ఈ సమాచారం జియో వెబ్సైట్ లో కూడా దొరుకుంతుంది. కానీ మీకోసం అన్ని ప్లాన్స్ సమాచారాన్ని ఒకే దగ్గర అందిస్తున్నాం. మరింకెందుకు ఆలస్యం ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.
Jio Phone రీచార్జ్ ప్లాన్స్: ధర, డేటా, వ్యాలిడిటీ
1. Jio Phone రూ.75 రీచార్జ్ ప్లాన్
ఈ బేసిక్ రీచార్జ్ ప్లాన్ ద్వారా జియో ఫోన్ కస్టమర్లు పొందే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఈ ప్లాన్ రీచార్జ్ చేస్తే, 23 రోజుల వ్యాలిడిటీ, 2.5జిబి డేటా (100ఎంబి/రోజుకి + 200ఎంబి), ఉచిత వాయిస్ కాల్స్, 50 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. ఇంకా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ కి ఫ్రీ యాక్సెస్ లభిస్తుంది.
2. Jio Phone రూ.91 రీచార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ రీచార్జ్ చేసిన వారికి 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే 3జిబి (100ఎంబి/రోజుకి + 200ఎంబి) డేటా వస్తుంది. ఇంకా ఉచిత వాయిస్ కాల్స్, 50 మెసేజ్ లు లభిస్తాయి. వీటితో పాటు, జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ యాప్స్ కి ఉచిత సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.
3. Jio Phone రూ.125 రీచార్జ్ ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా 23 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా 11.5 జిబి డేటా (రోజుకి 500ఎంబి), 300 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అలాగే ఉచిత వాయిస్ కాల్స్ కూడా ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.
4. Jio Phone రూ.152 రీచార్జ్ ప్లాన్
ఈ రీచార్జ్ ప్లాన్ తో కస్టమర్లు అపరిమిత కాలింగ్ సౌకర్యం, 14జిబి డేటా (రోజుకి 500ఎంబి), 300 ఎస్ఎంఎస్ లు, 28 రోజుల వ్యాలిడిటీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
5. Jio Phone రూ.186 రీచార్జ్ ప్లాన్
ఈ రీచార్జ్ ప్లాన్ ద్వారా రోజుకి 1జిబి డేటా లభిస్తుంది. అలాగే ఫ్రీ వాయిస్ కాల్స్, డెయిలీ 100 ఎస్ఎంఎస్ లు, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
6. Jio Phone రూ.222 రీచార్జ్ ప్లాన్
Jio Phone రూ.222 రీచార్జ్ ప్లాన్ ద్వారా ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. అంటే యూజర్లకు మొత్తంగా 56జిబి డేటా లభిస్తుందన్న మాట. అంతే కాకుండా, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు, అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్, జియో యాప్స్ కి ఉచిత యాక్సెస్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్ ద్వారా లభిస్తాయి.
7. Jio Phone రూ.899 రీచార్జ్ ప్లాన్
అన్ని Jio Phone ప్లాన్స్ లో కెల్లా ఇదే అత్యంత ఖరీదైనది. రీసెంట్ గా కంపెనీ ఈ ప్లాన్ ధరను పెంచింది. ఇంతకు ముందు దీని ధర రూ.749 గా ఉండేది. కానీ ఇప్పుడు కస్టమర్లు ఈ ప్లాన్ కోసం రూ.899 చెల్లించాల్సిందే. ఈ ప్లాన్ డెయిలీ డేటా లిమిట్ కాకుండా నెలవారీ డేటా లిమిట్ తో వస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు 336 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ప్రతి 28 రోజులకు 2జిబి డేటా లభిస్తుంది. అంటే పూర్తి వ్యాలిడిటీ కాల పరిమితి ముగిసే నాటికి కస్టమర్లు 24జిబి డేటా పొందుతారు.
Jio Phone డేటా వోచర్
జియో కంపెనీ Jio Phone వినియోగదారుల కోసం Jio Phone డేటా వోచర్ ని అందిస్తోంది. దీని ద్వారా కేవలం డేటా ప్లాన్స్ ని మాత్రమే రీచార్జ్ చేసుకోవచ్చు. తద్వారా డేటాని పొందవచ్చు.
1. JioPhone రూ.22 ప్లాన్ బెనిఫిట్స్: 28 రోజుల వ్యాలిడిటీ, 2జిబి డేటా.
2. JioPhone రూ.62 ప్లాన్ బెనిఫిట్స్: 28 రోజుల వ్యాలిడిటీ, 6జిబి డేటా.
3. JioPhone రూ.86 ప్లాన్ బెనిఫిట్స్: 500ఎంబి డెయిలీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.
4. JioPhone రూ.122 ప్లాన్ బెనిఫిట్స్: డెయిలీ 1జిబి డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.
5. JioPhone రూ.182 ప్లాన్ బెనిఫిట్స్: డెయిలీ 2జిబి డేటా, 28 రోజుల వ్యాలిడిటీ.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.













