108MP కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే తో లాంచ్ అయిన OPPO A1 Pro

హైలైట్స్

  • క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 చిప్సెట్ తో లాంచ్ అయిన OPPO A1 Pro
  • 108ఎంపి మెయిన్ కెమెరా, కర్వ్డ్ డిస్ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు
  • ప్రస్తుతానికి చైనాలో మాత్రమే లాంచ్ అయిన OPPO A1 Pro, త్వరలో ఇతర మార్కెట్స్ లో లాంచ్ అయ్యే అవకాశం

OPPO సంస్థ ఎట్టకేలకు OPPO A1 Pro స్మార్ట్ ఫోన్ ని చైనాలో లాంచ్ చేసింది. ప్రో ట్యాగ్ తో వస్తోన్న తొలి ఏ-సిరీస్ ఫోన్ ఇదే కావడం విశేషం. అలాగే కర్వ్డ్ డిస్ప్లే, 108ఎంపి కెమెరా సెటప్ కలిగిన తొలి ఏ-సిరీస్ ఫోన్ కూడా ఇదే కావడం గమనించదగిన విషయం.

OPPO A1 Pro క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్, 12జిబి ర్యామ్ తో మార్కెట్ లోకి వచ్చింది. ఇందులో 120 హెర్ట్జ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 108ఎంపి మెయిన్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 4800 ఎంఏహెచ్ బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. OPPO A1 Pro యొక్క ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం పదండి.

OPPO A1 Pro ధర, లభ్యత

OPPO A1 Pro స్మార్ట్ ఫోన్ 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ, 8జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ మరియు 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ తో వస్తోంది. వీటి ధరలు ఇక్కడ చూడండి.

A1 Pro 8GB + 128GB – RMB 1799 (సుమారు రూ.20,650)
A1 Pro 8GB + 256GB – RMB 1999 (సుమారు రూ.22,940)
A1 Pro 12GB + 256GB – RMB 2299 (సుమారు రూ.26,380)

OPPO A1 Pro స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం చైనాలో ప్రీ-ఆర్డర్ కి అందుబాటులో ఉంది. నవంబర్ 25 నుంచి ఈ ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. OPPO A1 Pro యొక్క గ్లోబల్ మరియు ఇండియా లభ్యత పై ఒప్పో ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది.

OPPO A1 Pro స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

OPPO A1 Pro 6.7-ఇంచ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 360 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో వచ్చింది. సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఇందులో ఉంది. ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని ఈ ఫోన్ లో అందించారు.

OPPO A1 Pro స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 695 ప్రాసెసర్ ని కలిగి ఉంది. ఇది 6ఎన్ఎం ప్రాసెస్ పై తయారైన చిప్. గ్రాఫిక్స్ కోసం ఇందులో అడ్రెనో 619 జీపీయూ వాడారు. ఇది 5జీ మోడెమ్ తో ఇంటిగ్రేట్ చేయబడింది. ఇది 12జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 2.0 ఇంటర్నల్ స్టోరేజీతో వస్తోంది. 8జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్ ఈ ఫోన్ లో ఉంది.

OPPO A1 Pro లో 108ఎంపి మెయిన్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 2ఎంపి పొట్రెయిట్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

OPPO A1 Pro లో 4800ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 67 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. ఈ హ్యాండ్సెట్ యూఎస్బీ 2.0 టైప్ సీ పోర్ట్ ని కలిగి ఉంది. ఈ ఫోన్ లో 3.5ఎంఎం ఆడియో జాక్ లేదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత, కలర్ ఓఎస్ 13 పై పని చేస్తుంది.

OPPO A1 Pro మూన్‌సీ బ్లాక్, డాన్ గోల్డ్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 162.3 మిల్లీ మీటర్ల పొడవు, 74.3 మిల్లీ మీటర్ల వెడల్పు, 7.7 మిల్లీ మీటర్ల మందం, 171 గ్రాముల బరువు ఉంటుంది. డ్యూయల్ సిమ్, 5జీ, వైఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.