హైలైట్స్
- Nothing Phone (1) పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన కంపెనీ
- ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్న డీల్, ఆఫర్ తో రూ.26,249 కి అందుబాటులో ఫోన్
- గ్లైఫ్ ఇంటర్ఫేస్, స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, 50ఎంపి+50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఈ ఫోన్ ప్రధాన స్పెసిఫికేషన్స్
Nothing Phone (1) పై నతింగ్ కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. రూ.6,500 డిస్కౌంట్ తో ఫ్లిప్ కార్ట్ ద్వారా Nothing Phone (1) ని కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్ కూడా కల్పుకుంటే ఈ ఫోన్ రూ.26,249 కే లభిస్తోంది. Nothing Phone (1) జులై లో లాంచ్ అయ్యింది. క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్, గ్లైఫ్ ఇంటర్ఫేస్, 120హెర్ట్జ్ అమోలెడ్ డిస్ప్లే, 50ఎంపి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్, వైర్లెస్ చార్జింగ్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయ్యింది.
Nothing Phone (1) ఫ్లిప్ కార్ట్ డీల్
Nothing సంస్థ Nothing Phone (1) పై రూ.6,500 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. దీనికి అదనంగా, ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ హోల్టర్స్ రూ.1250 డిస్కౌంట్ పొందవచ్చు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ పై 10 శాతం (రూ.1250 వరకు) డిస్కౌంట్ పొందవచ్చు.
ఎందుకిది గుడ్ డీల్?
మీరు గనుక రూ.25,000 నుంచి రూ.30,000 సెగ్మెంట్ లో ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Nothing Phone (1) ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ లో లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. మరే ఇతర ఫోన్ లో కూడా ఇటువంటి ఫీచర్స్ లేవు. అందుకు ప్రధాన కారణం Nothing Phone (1) లో ఉన్న గ్లైఫ్ ఇంటర్ఫేస్. 900 ఎల్ఈడీ బల్బులతో కూడిన ఈ అమరిక ఫోన్ కి ఒక డిఫరెంట్ లుక్ తీసుకొచ్చింది. ఏదైనా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకునే వారికి Nothing Phone (1) బాగా సెట్ అవుతుంది.
Nothing Phone (1) లో అల్యూమినియమ్ మెటల్ ఫ్రేమ్ అందించారు. కాబట్టి భద్రతకి ఢోకా లేదు. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. రెండు సెన్సర్స్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తాయి. వైర్లెస్, రివర్స్ వైర్లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. మనం పెట్టే ధరకి Nothing Phone (1) లో తప్పితే ఇతర ఫోన్లలో ఈ ఫీచర్స్ లేవనే చెప్పాలి.
Nothing Phone (1) స్పెసిఫికేషన్స్, ఫీచర్స్
Nothing Phone (1) లో 6.55-ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 1200 నిట్స్ బ్రైట్నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 778జి+ ప్రాసెసర్ తో వచ్చింది. ఇంకా 12జిబి వరకు ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ డివైజ్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత నతింగ్ ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
Nothing Phone (1) లో 50ఎంపి సోని ఐఎంఎక్స్766 మెయిన్ సెన్సర్, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు. Nothing Phone (1) లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ఉన్నాయి. ఈ ఫోన్ 15 వాట్ క్యూఐ వైర్లెస్ చార్జింగ్, 5 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్స్ ని కలిగి ఉంది.
లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, ఆటోమొబైల్, టెక్నాలజీ, టెలీకామ్, ఎంటర్టెయిన్మెంట్ న్యూస్ కోసం 91మొబైల్స్ తెలుగు ఫేస్‌బుక్ పేజీని లైక్ చేసి ఫాలో అవ్వండి.












